ETV Bharat / business

కొత్త కారు కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్​-5 వెహికల్స్​ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 12:23 PM IST

Best Cars Under 10 Lakh : మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.10 లక్షలు మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో రూ.10 లక్షల్లో లభిస్తున్న టాప్​-5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Top 5 Cars Under 10 Lakh
Best Cars Under 10 Lakh

Best Cars Under 10 Lakh : స్టైలిష్​ డిజైన్​తో, స్టన్నింగ్ ఫీచర్స్​ ఉన్న కారు కొనాలని చాలా మంది ఆశిస్తూ ఉంటారు. మరికొందరు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు కొనాలని అనుకుంటారు. మీరు కూడా ఇలానే ఆలోచిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్​. ప్రస్తుతం భారత్​లో కేవలం రూ.10 లక్షల బడ్జెట్లో టాప్​ మోడల్​ కార్లు లభిస్తున్నాయి. వాటిలోని టాప్​-5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Tata Punch : టాటా మోటార్స్ పంచ్ ఎస్‌యూవీని అక్టోబర్ 2021లో లాంఛ్​ చేసింది. కస్టమర్లు దీనిని రూ.5.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు. ప్రస్తుతం రూ.6 లక్షల ధరలో ఎంట్రీ-లెవల్ ప్యూర్ ఎంటీ వేరియంట్​ అందుబాటులో ఉంది. టాటా పంచ్ ప్రస్తుతం ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్, క్రియేటివ్ అనే 4 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ మోడల్​ 7 కలర్స్ ఆప్షన్స్​లో లభిస్తుంది.

2. Tata Nexon : టాటా మోటార్స్ నుంచి వచ్చిన మరో మోడల్ టాటా నెక్సాన్. ఈ కారు ధర రూ.9.74 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది. నెక్సాన్ స్మార్ట్, స్మార్ట్+, స్మార్ట్+ S, ప్యూర్, ప్యూర్ S, క్రియేటివ్, క్రియేటివ్+,క్రియేటివ్+ S, ఫియర్‌లెస్, ఫియర్‌లెస్ S, ఫియర్‌లెస్+ S అనే 11 వేరియంట్‌లలో లభిస్తుంది. 2023 నెక్సాన్ మారుతి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, రెనో కైగర్, మహీంద్రా ఎక్స్​యూవీ300 , నిస్సాన్ మాగ్నైట్‌లకు ఇది పోటీగా ఉంది.

3. Maruti Brezza : బ్రెజ్జా సబ్-4 మీటర్ ఎస్‍యూవీ. దీనిలో 1.5 లీటర్, 4 సిలిండర్, ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 102 bhp పవర్​, 137Nm టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‍జీ వేరియంట్​ 87 bhp పవర్​, 121Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ ఆప్షన్లతో ఇవి వస్తాయి. హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్​తో పోటీ పడుతున్న మారుతి సుజుకి బ్రెజ్జా ధరలు రూ.8.29 లక్షలు (ఎక్స్-షోరూం)తో ప్రారంభమవుతాయి.

4. Maruti Swift : మారుతి సుజుకి నుంచి వచ్చిన పాపులర్ హ్యాచ్‌బ్యాక్‌లలో స్విఫ్ట్‌ ఒకటి. దీని ధర సుమారుగా రూ.5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ప్రస్తుతం మారుతి సుజుకి కంపెనీ స్విఫ్ట్​ని పెట్రోల్, డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో; LXi, VXi, ZXi, ZXi ప్లస్ అనే 4 వేరియంట్లలో అందిస్తోంది. స్విఫ్ట్ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 89bhp పవర్, 113Nm టార్క్​ ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‍జీ వేరియంట్​ 76bhp పవర్, 98Nm టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్​, ఏఎంటీ గేర్​బాక్స్ ఆప్షన్లతో ఇది వస్తుంది.

5. Mahindra XUV300 : ఈ మహీంద్రా XUV300 సబ్ 4-మీటర్ ఎస్‍యూవీ. ఇది W2, W4, W6, W8, W8 (O) అనే 5 వేరియంట్లలో లభిస్తుంది. ఈ మహీంద్రా ఎక్స్​యూవీ రూ.7.99 లక్షల (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. కస్టమర్స్ దీనిని బ్లేజింగ్ బ్రాంజ్, నపోలి బ్లాక్, ఎవరెస్ట్ వైట్ లాంటి కలర్ ఆప్షన్లతో కొనుగోలు చేయవచ్చు. ఇవన్నీ కూడా కాంట్రాస్ట్-కలర్ రూఫ్‌ను కలిగి ఉంటాయి. ఈ మహీంద్రా XUV300 సీటింగ్ లేఅవుట్‌ ఐదుగురు వ్యక్తులు సౌకర్యవంతంగా ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది.

మంచి టూ-వీలర్​ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్​-3 అప్​కమింగ్​ బైక్స్ ​& స్కూటీస్​ ఇవే!

వేసవిలోనూ ఎలక్ట్రిక్ వెహికల్​​ మంచి కండిషన్​లో ఉండాలా? ఈ 5 ప్రో టిప్స్ మీ కోసమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.