ETV Bharat / business

వేసవిలోనూ ఎలక్ట్రిక్ వెహికల్​​ మంచి కండిషన్​లో ఉండాలా? ఈ 5 ప్రో టిప్స్ మీ కోసమే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 5:07 PM IST

Electric Car Maintenance Tips For Summer : అప్పుడే వేసవి ఎండలు తమ ప్రతాపం చూపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఈవీ కార్లు, బైక్​లు మంచి కండిషన్​లో ఉంటాయి. అందుకే వేసవిలో ఈవీ వెహికల్​ మెయింటెనెన్స్ కోసం ఉపయోగపడే 5 ప్రో టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Electric Car care Tips For Summer
Electric Car Maintenance Tips For Summer

Electric Car Maintenance Tips For Summer : అప్పుడే వేసవి ఎండలు మొదలైపోయాయి. రానున్న రోజుల్లో ఈ ఎండలు మరింత తీవ్రం అవుతాయి. కనుక విద్యుత్ వాహనాలు ఉన్నవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు, బైక్​ల ఛార్జింగ్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. మీరు కనుక సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, ఎలక్ట్రిక్ కార్లు, బైక్​ల్లోని బ్యాటరీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాటి సామర్థ్యం, జీవితకాలం తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే వేసవిలో మీ ఈవీని సరైన కండిషన్​లో ఉంచుకోవడానికి కావాల్సిన 5 ప్రో టిప్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రీ కండిషనింగ్ : చాలా ఎలక్ట్రిక్ వాహనాలలో ప్రీ కండిషనింగ్ ఫీచర్ ఉంటుంది. ఇది వేడి, చల్లని వాతావరణాలు రెండింటికీ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ మీ కార్ల క్యాబిన్‌ను ప్రీ-కూల్ చేస్తుంది. దీని వల్ల వెహికల్​ పెర్ఫార్మెన్స్ మెరుగుపడుతుంది. ఫలితంగా డ్రైవింగ్​ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ప్రీ కండిషనింగ్​ ఫీచర్​ను యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు.

నీడలో పార్కింగ్​ : మీ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ వేడెక్కకుండా ఉండాలంటే, వాటిని నీడలో పార్క్ చేయాలి. నేరుగా ఎండ తగిలే ప్రదేశంలో అస్సలు ఉంచకూడదు. చెట్టు కింద, గ్యారేజీలో లేదా కనీసం నీడ ఉన్న ప్రదేశంలో ఈవీ కారు/ బైక్​లను పార్క్ చేయాలి. అప్పుడే బండిలోని బ్యాటరీ వేడెక్కకుండా ఉంటుంది. ఫలితంగా డ్రైవింగ్ రేంజ్​ కూడా తగ్గకుండా ఉంటుంది.

స్మార్ట్ ఛార్జింగ్ : బ్యాటరీ హెల్త్​ బాగుండాలంటే, మీ ఎలక్ట్రిక్ వాహనాలను 20% నుంచి 80% వరకు మాత్రమే ఛార్జ్ చేయాలి. మొబైల్ ఫోన్‌ల మాదిరిగానే, ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువసేపు ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ వేడెక్కిపోతుంది. అలాగే వేసవిలో ఎక్కువసేపు ఛార్జ్ చేస్తే, బ్యాటరీ వేగంగా డిశ్చార్జ్ అయిపోతుంది. ఫలితంగా దాని పెర్ఫార్మెన్స్ బాగా తగ్గిపోతుంది.

టైర్ ప్రెజర్ : వేసవిలో ఎలక్ట్రిక్, ఐసీఈ బేస్డ్ వెహికల్స్ పెర్ఫార్మెన్స్ బాగా ఉండాలంటే, కచ్చితంగా వాటి టైర్ ప్రెజర్​ను చెక్​ చేసుకుంటూ ఉండాలి. సాధారణంగా వేడి వాతావరణంలో టైర్ల లోపల ప్రెజర్​ విపరీతంగా పెరిగిపోతుంది. కనుక ఒక టైర్ కపాసిటీకి సరిపోయేంత ప్రెజర్​ దానిలో ఉందో, లేదో కచ్చితంగా రెగ్యులర్​గా చెక్ చేసుకుంటూ ఉండాలి.

డ్రైవింగ్ చేసిన వెంటనే ఈవీని ఛార్జ్ చేయకూడదు : విద్యుత్ వాహనాలను డ్రైవ్​ చేసిన వెంటనే ఛార్జ్ చేయకూడదు. ఇలా చేస్తే బ్యాటరీ చాలా త్వరగా వేడెక్కి పోతుంది. అలాగే ఎలక్ట్రిక్ కార్లను నేరుగా ఎండలో ఉంచి అస్సలు ఛార్జ్ చేయకూడదు. ఈవీలకు రాత్రి పూట లేదా తెల్లవారుజామున మాత్రమే ఛార్జింగ్ పెట్టాలి. అప్పుడు వాతావరణం కాస్త చల్లగా ఉంటుంది కనుక వాహనాలకు ఏమీ కాకుండా ఉంటుంది.

మంచి టూ-వీలర్​ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్​-3 అప్​కమింగ్​ బైక్స్ ​& స్కూటీస్​ ఇవే!

అతి త్వరలో లాంఛ్ కానున్న టాప్​-5 SUV కార్స్​ ఇవే! ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.