How To Withdraw PF Balance From UMANG App :ప్రస్తుతం ప్రతి ఒక్క ఉద్యోగికి దాదాపుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) ఖాతా ఉంటుంది. ప్రతినెలా వారి ప్రాథమిక జీతంలో కొంత శాతం మేర పీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూషన్‌గా చెల్లిస్తుంటారు. అలాగే వారు పని చేస్తున్న సంస్థ కూడా అంతే మొత్తాన్ని ఆ ఉద్యోగుల అకౌంట్‌కు జమ చేస్తుంది. ఉద్యోగ విరమణ తర్వాత.. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఈ డబ్బు చాలా బాగా ఉపయోగపడుతుంది.
అయితే, కొంతమందికి అత్యవసర పరిస్థితుల్లో డబ్బు చాలా అవసరమవుతుంది. దీంతో చాలా మంది EPFO వెబ్సైట్లోకి వెళ్లి పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకుంటారు. అయితే, ఈ విధంగా డబ్బులను విత్‌డ్రా చేయడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకే ఈపీఎఫ్ఓ వినియోగదారుల కోసం ఉమాంగ్ యాప్ (UMANG app) ద్వారా క్షణాల్లోనే డబ్బులను విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. మరి ఉమాంగ్ యాప్ ద్వారా ఏ విధంగా డబ్బులను విత్‌డ్రా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఉమాంగ్ యాప్ ఉపయోగించి పీఎఫ్ డబ్బులను ఎలా విత్‌డ్రా చేయాలి ?
- ముందుగా ప్లేస్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ (UMANG App)ను డౌన్లోడ్ చేసుకోండి.
- యాప్ ఓపెన్ చేసిన అనంతరం అవసరమైన వివరాలతో లాగిన్ అవ్వాలి.
- తర్వాత సర్వీస్ సెక్షన్లో EPFO ఆప్షన్‌ను ఎంచుకోండి.
- తర్వాత 'Employee Centric Services' సెక్షన్లో Raise Claim ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- ఇప్పుడు UAN నెంబర్‌ను ఎంటర్ చేయండి. తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఒక OTP వస్తుంది. దానిని ఎంటర్ చేయండి.