ETV Bharat / business

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ - అడ్వాన్స్​ విత్​డ్రావెల్ లిమిట్​ 'డబుల్'! - EPF Advance Claim Limit

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 1:20 PM IST

EPF Advance Claim Limit : పీఎఫ్ అకౌంట్ నుంచి నగదు విత్​డ్రా చేసుకోవాలనుకునేవారికి ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటో క్లెయిమ్‌ పరిమితిని రెట్టింపు చేసింది. పూర్తి వివరాలు మీ కోసం.

PF Medical Claimn limit
PF Medical Claim process

EPF Advance Claim Limit : ఈపీఎఫ్‌ ఖాతాలో జమ అవుతున్న సొమ్ము రిటైర్మెంట్ కోసం ఉద్దేశించినదైనా, ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో చందాదారులు పాక్షికంగా విత్​డ్రా చేసుకునే అవకాశాన్ని ఈపీఎఫ్​ఓ సంస్థ ఇస్తోంది. విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం ఇలా పలు సందర్భాల్లో ఈపీఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తం నగదును అడ్వాన్స్​గా విత్​డ్రా చేసుకోవచ్చు. అయితే దీనికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. తాజాగా నగదు విత్​డ్రా పరిమితుల్లో ఈపీఎఫ్‌వో కీలక మార్పులు తెచ్చింది. వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటో క్లెయిమ్‌ పరిమితిని ఈపీఎఫ్‌ఓ రెట్టింపు చేసింది.

వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటో క్లైయిమ్​ లిమిట్​ను పెంచుతున్నట్లు ఈపీఎఫ్‌ఓ ఓ సర్క్యులర్‌ విడుదల చేసింది. పేరా 68J కింద ఆటో క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ లిమిట్​ను రూ.50 వేల నుంచి రూ.1లక్ష వరకు పెంచుతున్నట్లు సర్క్యులర్​లో పేర్కొంది. 'పీఎఫ్ ఖాతా ఉన్నవారు తమ వ్యక్తిగత లేదా కుటుంబసభ్యుల వైద్య ఖర్చుల కోసం 68J పేరా కింద ఈపీఎఫ్‌ డబ్బులను విత్​డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది.

కండిషన్స్ అప్లై
నెల రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ తీసుకుంటున్నా, సర్జరీలు చేయించుకున్నా ఈపీఎఫ్ నుంచి డబ్బులను విత్​డ్రా చేసుకోవచ్చు. టీబీ, క్షయ, పక్షవాతం, క్యాన్సర్‌, గుండె చికిత్సల కోసం అడ్వాన్స్​ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎలాంటి మెడికల్‌ సర్టిఫికెట్లు లేకుండానే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ సమర్పించి క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఉద్యోగి 6 నెలల బేసిక్‌ సాలరీ + డీఏ లేదా జమ అయిన మొత్తంలో ఉద్యోగి వాటా (వడ్డీ సహా) ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంత వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంది. అంతేకాకుండా దివ్యాంగులైన ఈపీఎఫ్​ సభ్యులు తమకు అవసరమైన పరికరాలను కొనేందుకు పేరా 68N ప్రకారం, ఈపీఎఫ్ డబ్బులను విత్​డ్రా చేసుకోవచ్చు.

ఈపీఎఫ్ ఖాతాదారులు ఇంటిని కొనుగోలు చేయడం/నిర్మించడం, రుణం తిరిగి చెల్లించడం, రెండు నెలలుగా వేతనాలు రాకపోవడం, కుమార్తె/కొడుకు/సోదరుడి లేదా సొంత వివాహం, కుటుంబ సభ్యుల వైద్య చికిత్సలు, మహమ్మారి వంటి వివిధ అవసరాల కోసం పాక్షికంగా డబ్బులు విత్​డ్రా చేసుకోవచ్చు.

ఈపీఎఫ్ఓలో అడ్వాన్స్ క్లెయిమ్‌లను ఎలా ఫైల్ చేయాలి?

  • UAN, పాస్‌వర్డ్​ను ఉపయోగించి EPFO పోర్టల్​లో చందాదారుడు లాగిన్ అవ్వాలి.
  • ఆ తర్వాత ఆన్​లైన్ సర్వీస్​పై క్లిక్ చేయాలి.
  • క్లెయిమ్ సెక్షన్​ను ఎంచుకోవాలి
  • బ్యాంక్ ఖాతా నంబర్​ను ధ్రువీకరించాలి.
  • అనంతరం చెక్కు లేదా పాస్‌బుక్ స్కాన్ చేసిన కాపీని అప్​లోడ్ చేయాలి.
  • అడ్వాన్స్‌ ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • ఆధార్ ఆధారిత OTPని ఎంటర్​ చేయాలి.
  • ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత, ఎంప్లాయిస్​ ఈ క్లెయిమ్ ఆమోదించాల్సి ఉంటుంది.
  • ఎంప్లాయర్ క్లెయిమ్​ను ఆమోదించిన తరువాత, ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం, ఉద్యోగి అకౌంట్లో నగదు జమ అవుతుంది.
  • క్లెయిస్​ స్టేటస్​ను మీరు 'ఆన్‌లైన్ సర్వీస్' విభాగంలోకి వెళ్లి చూడవచ్చు.

జీవిత బీమా తీసుకున్నారా? పరిహారం ఇవ్వకపోతే ఏం చేయాలో తెలుసా? - Life Insurance Claim Settlement

రిటైర్​మెంట్ ప్లాన్​ - ఈ టిప్స్​ పాటిస్తే 'ఎక్స్​ట్రా పెన్షన్' గ్యారెంటీ! - EPFO Pension Rules

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.