How To Check TDS Amount Online : పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఆన్లైన్లోనే చాలా సులువుగా తమ ట్యాక్స్ క్రెడిట్స్‌ను చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆదాయపన్ను శాఖ నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో పన్ను చెల్లింపుదారులు తమ టీడీఎస్ (ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్)ను చాలా సులువుగా చెక్ చేసుకోవచ్చు. అయితే వారు ముందుగా తమ పాన్ కార్డును పోర్టల్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
టీడీఎస్ అంటే ఏమిటి?
- కంపెనీ ఒక వ్యక్తికి చేసిన చెల్లింపులపై విధించే పన్నునే టీడీఎస్ అంటారు.
- జీతాలు, అద్దె చెల్లింపులు, బ్రోకరేజీ, కమీషన్, ప్రొఫెషనల్ ఫీజు లాంటి చెల్లింపులు అన్నింటిపై ఈ టీడీఎస్ వర్తిస్తుంది. అయితే ఈ టీడీఎస్ రేట్లు వ్యక్తుల వయస్సు, ఆదాయం ఆధారంగా నిర్ణయించబడతాయి.
- వాస్తవానికి యజమాని - ఉద్యోగికి జీతం ఇచ్చినప్పుడే ఈ టీడీఎస్‌ను కట్ చేసి, దానిని ప్రభుత్వానికి చెల్లిస్తాడు.
- దీని వల్ల ఉద్యోగులు పన్ను ఎగవేయడానికి వీలుపడదు.
సరే, ఇప్పుడు మనం పాన్ కార్డ్‌ను ఉపయోగించి, ఆన్లైన్లో టీడీఎస్ అమౌంట్‌ను ఎలా చెక్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.
How To Check TDS Amount In Net Banking App Using PAN Card :
- ముందుగా మీ ఆథరైజ్డ్ నెట్ బ్యాంకింగ్ యాప్‌ను ప్లేసోర్ట్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
- సదరు నెట్ బ్యాంకింగ్ యాప్‌లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి.
- ఆ యాప్‌లోనే మీ బ్యాంక్ అకౌంట్‌తో పాన్ కార్డ్‌ను లింక్ చేసుకోవాలి.
- అప్పుడు మీరు మీ బ్యాంక్ స్టేట్మెంట్ను సులువుగా చూడవచ్చు. దీనిలోనే డీటీఎస్ వివరాలు ఉంటాయి. లేదా
- మీరు చెల్లించిన పన్ను వివరాల రికార్డును చూడవచ్చు. దీని ద్వారా కూడా టీడీఎస్ రిటర్న్‌లను చూడవచ్చు.