తెలంగాణ

telangana

ఇండియా కూటమిలో సీట్ల రగడ- త్వరలో క్లారిటీ వస్తుందన్న కాంగ్రెస్​- మరో లిస్ట్ రిలీజ్ చేసి SP షాక్​

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 8:34 PM IST

SP Congress Seat Distribution : ఇండియా కూటమిలో విబేధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కాంగ్రెస్​తో చర్చలు ఓ కొలిక్కి రాకుండానే యూపీలోని సమాజ్​వాదీ పార్టీ మరోసారి 9మంది అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు ఇండియా కూటమిలో ఏ సమయంలోనైనా సీట్ల ఖరారు అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ తెలిపింది.

SP Congress Seat Distribution
SP Congress Seat Distribution

SP Congress Seat Distribution :కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమిలో అనైక్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఓ వైపు సీట్ల సర్దుబాటుపై ఏ సమయంలోనైనా క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ చెబుతుండగానే, ఎస్​పీ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్​తో సీట్ల అంశం ఓ కొలిక్కి రాకుండానే సమాజ్​వాదీ పార్టీ తాజాగా మరో 9మంది అభ్యర్థులను ప్రకటించింది.

'ఏ సమయంలోనైనా ఖరారయ్యే ఛాన్స్'
ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నియమించిన కూటమి బృందం అన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లుగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ చర్చలు ఏ సమయంలోనైనా ఖరారయ్యే అవకాశం ఉందని, అంతవరకూ వేచిచూడాలని మీడియాను ఆయన కోరారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ తమకు 17 సీట్లు ప్రతిపాదించిందని, ఇంకా ఎక్కువ సీట్లు కావాలని కోరుతున్నట్లు వేణుగోపాల్‌ చెప్పారు. అయితే త్వరలోనే ఇరుపార్టీల మధ్య అంగీకారం కుదిరే అవకాశం ఉందన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 80 స్థానాలు ఉండగా ఎస్పీ ఇప్పటికే 27మంది అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో రాహుల్‌గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర నిర్వహిస్తున్నప్పటికీ ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ పాల్గొనలేదు. సీట్ల సర్దుబాటు జరిగిన తర్వాతే ఆయన పాల్గొనే అవకాశం ఉన్నట్లు తేల్చి చెప్పారు.

'ఇండియా కూటమికి వరుస ఎదురుదెబ్బలు'
మరోవైపు ఇండియా కూటమికి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే లోక్​సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతామని కొద్ది రోజుల క్రితం మమతా బెనర్జీ ప్రకటించారు. ఆమ్ ​ఆద్మీ పార్టీ కూడా అదే మార్గాన్ని ఎంచుకుంది. పంజాబ్​లో కూటమితో తమకు ఎలాంటి పొత్తు ఉండదని ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం పంజాబ్​లోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలకు తాము పార్టీ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు ఆప్ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​. వచ్చే 10-15 రోజుల్లో మొత్తం 14 స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్​పై క్లిక్చేయండి.

ఇండియాకు మరో షాక్​! కూటమి నుంచి RLD ఔట్​! బీజేపీతో చర్చలు

'కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకోం'- ఒకే రోజు షాక్​ ఇచ్చిన ఆప్​, టీఎంసీ

ABOUT THE AUTHOR

...view details