తెలంగాణ

telangana

శివయ్య దర్శనం- 4గంటలపాటు రోడ్ షో- మోదీ నామినేషన్​కు భారీ ఏర్పాట్లు - Lok Sabha Elections 2024

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 6:39 PM IST

PM Modi Nomination : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్‌ వేసేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. నామపత్రాల దాఖలు సందర్భంగా భారీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వారణాసిలో మోదీ రోడ్‌షోకు కమలదళం ఏర్పాట్లు చేస్తోంది.

PM Modi
PM Modi (Source : Getty Images)

PM Modi Nomination :ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో మే 14వ తేదీన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ సీనియర్‌ నేత సునీల్‌ బన్సల్‌ చాలా రోజుల నుంచి అక్కడే ఉండి పనులను చక్కబెడుతున్నారు.

నాలుగు గంటలు, ఐదు కి.మీ రోడ్ షో
Varanasi Lok Sabha Polls : నామినేషన్‌ ప్రక్రియ సందర్భంగా కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. బనారస్‌ హిందూ యూనివర్శిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఇది సుమారు నాలుగు గంటలపాటు ఉండనుందని తెలుస్తోంది. అదే రోజు ఎన్డీఏ నేతల సమావేశంలో ప్రధాని పాల్గొంటారని సమాచారం.

మే చివరి నాటికి మొత్తం 190 రోడ్​షోలు!
Modi Campaign :గతంలో ప్రధాని మోదీ నామినేషన్‌ దాఖలు చేసిన వివరాల ప్రకారం, ఆయనకు ప్రస్తుతం 73 ఏళ్లు. 2024 ఎన్నికల ప్రచారంలో నిత్యం వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ సగటున మూడు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మోదీ. నామినేషన్‌కు వెళ్లే ముందు ప్రధాని, సోమవారం పట్నాలో మూడు ర్యాలీలను పూర్తిచేసుకొని వారణాసి చేరుకుంటారని తెలుస్తోంది. అక్కడ మరికొన్ని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. ఎన్నికల ప్రచారం పూర్తి కానున్న మే చివరి నాటికి మోదీ మొత్తం 180 నుంచి 190 రోడ్‌షోలు, ర్యాలీలు, సభల్లో పాల్గొనున్నారు.

మోదీ ప్రత్యర్థి ఆయనే!
Varanasi Constituency Result : గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ మెజార్టీతో గెలిచారు. 2014లో ఆప్‌ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ప్రధాని గెలుపొందారు. 2019లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్‌పై 4 లక్షల 70 వేల పై చిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రధానికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ పోటీలో ఉన్నారు.

'బంగాల్​లో మమత కుంభకోణాల ఫ్యాక్టరీ- కాంగ్రెస్‌కు 'యువరాజు' ఏజ్ కన్నా తక్కువ సీట్లు!' - Lok Sabha Elections 2024

బహిరంగ చర్చకు రాహుల్​ సిద్ధం- ప్రధాని స్పందనేంటో చెప్పండంటూ ట్వీట్! - Lok Sabha Elections 2024

ABOUT THE AUTHOR

...view details