ఫుడ్​ డెలివరీ బాయ్​ మర్మాంగంపై కుక్క కాటు.. లిఫ్ట్​ నుంచి బయటకు వస్తుండగా..

By

Published : Sep 10, 2022, 2:39 PM IST

thumbnail

కస్టమర్​కు ఫుడ్​ ఆర్డర్​ ఇవ్వడానికి వెళ్లిన ఓ డెలివరీ బాయ్​ మర్మాంగంపై కుక్క కాటు వేసిన ఘటన మహారాష్ట్రలోని ఠాణెలో జరిగింది. పన్వెల్ ప్రాంతంలో ఫుడ్​ ఆర్డర్​ పెట్టిన ఓ కస్టమర్​కు పార్సిల్​ ఇవ్వడానికి జొమాటో డెలివరీ బాయ్​ వెళ్లాడు. ఆ తర్వాత లిఫ్ట్​ నుంచి బయటకు వస్తుండగా.. అక్కడే ఉన్న ఓ కుక్క ఒక్కసారిగా అతడి మర్మాంగంపై కరిచింది. వెంటనే గమనించిన స్థానికులు.. అతడ్ని డీవై పాటిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఆగస్టు 27న జరిగింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.