పోలింగ్ జరిగిన 4 రోజులకు తిరిగొచ్చిన సిబ్బంది- అతికష్టమ్మీద ఈవీఎంలను తీసుకొచ్చిన 13మంది - Lok Sabha Elections 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 5:55 PM IST

thumbnail
()

Election Staff Returned To Home After Four Days : దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల సందడి నెలకొంది. తొలి విడత ఇటీవల ముగియగా శుక్రవారం రెండో విడత పోలింగ్ జరగనుంది. అయితే తొలి విడత ఏప్రిల్ 19వ తేదీన జరగ్గా, ఓ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వర్తించిన సిబ్బంది నాలుగు రోజుల తర్వాత ఇంటికి చేరుకున్నారు. అతికష్టమ్మీద ఈవీఎంలను తిరిగి తీసుకొచ్చారు. అసలేం జరిగిందంటే?

అరుణాచల్ ప్రదేశ్​ దిబాంగ్ వ్యాలీ జిల్లాలో ఎత్తైన ప్రాంతంలో ఉన్న లగుతాంగ్ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వర్తించేందుకు 13 మందిని ఎన్నికల సంఘం నియమించింది. వీరంతా ఏప్రిల్ 18వ తేదీన అక్కడికి చేరుకున్నారు. అయితే పోలింగ్ రోజు భారీ వర్షాలు కురవడం వల్ల రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

దీంతో చేసేదేం లేక లగుతాంగ్ కేంద్రం పోలింగ్ సిబ్బంది రెండు రోజుల తర్వాత ఈవీఎంలతో బయలుదేరారు. సాహసోపేతమైన ప్రయాణాన్ని చేశారు. 12 గంటలపాటు కాలినడకన ఇళ్లకు చేరుకున్నారు. మార్గమధ్యలో ఏడు నదులను దాటారు. వెదురు వంతెనలపై ఈవీఎంలను మోసుకుంటూ వచ్చారు. దీంతో వారి ధైర్యాన్ని ఎన్నికల అధికారులు ప్రశంసించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.