YADADRI: శివాలయ రథశాలకు సంప్రదాయ హంగులు

By

Published : Jul 30, 2021, 10:54 AM IST

thumbnail

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి(yadadri sri lakshmi narasimha swamy temple) ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భక్తజన సందోహం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోవెల వైభవంగా ముస్తాబవుతోంది. శివాలయం రథశాలను సంప్రదాయ హంగులతో తీర్చిదిద్దేందుకు యాడా కసరత్తు చేస్తోంది. శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని పునర్నిర్మించగా.. ఇక్కడ 32 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో నిర్మితమైన శివపార్వతుల రథశాలను తీర్చిదిద్దుతున్నారు. ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి నేతృత్వంలో దివ్యంగా రూపొందుతోంది. కృష్ణశిలతో సిద్ధం చేసిన ఆ ప్రతిమను సిద్ధం చేశారు. బయట స్వాగత తోరణంపైనా సిమెంట్‌తో శివపార్వతుల రూపాలను ఇప్పటికే తీర్చిదిద్దారు. వివిధ ఉపఆలయ ద్వారాలకు ఇత్తడి తొడుగులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ఫ్లవర్ నగిషీలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.