తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ మరోసారి కన్నేసింది : బోయినపల్లి వినోద్ కుమార్
Vinodkumar Comments On Congress : హైదరాబాద్ నగరంలో కల్లోలం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై మరోసారి కన్నేసిందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్లో నియోజకవర్గ బూత్ అధ్యక్షుల సమావేశంలో వినోద్ ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్లో ఒక్కరోజు కూడా కర్ఫ్యు పరిస్థితి లేదని వినోద్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ చేతికి అధికారం ఇస్తే రాష్ట్ర పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా అవుతుందని వినోద్ కుమార్ ఎద్దేవా చేశారు.
Election campaign In Telangana 2023 : రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవాలంటే బీఆర్ఎస్కు మరో ఐదేళ్లు చాలా కీలకం అన్నారు. కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రిని మార్చేందుకు అనేక హత్యలు జరిగాయని తాము కళ్లారా చూసామని అన్నారు. రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి సాధించేందుకు బీఆర్ఎస్కు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. చొప్పదండి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధి సుంకె రవిశంకర్ సహా తదితర పార్టీ నాయకులు హాజరయ్యారు.