బలరామావతారంలో దర్శనమిచ్చిన శ్రీరామ చంద్రుడు

By ETV Bharat Telangana Team

Published : Dec 20, 2023, 5:39 PM IST

thumbnail

Vaikunta Ekadasi Festival in Bhadrachalam : భద్రాద్రి రామయ్య సన్నిధిలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో 8వ రోజైన నేడు బలరామ అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. ఈనెల 13 నుంచి జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా రోజుకు ఒక అవతారంలో దర్శనమిచ్చిన స్వామి వారు బలరామ అవతారంలో అనుగ్రహిస్తున్నారు. బలరామ అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారికి ఆలయ అర్చకులు బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

Bhadradri Ramayya Teppotsavam : ఇవాళ మధ్యాహ్నం మహా నివేదన అనంతరం స్వామి వారు తిరువీధి సేవకు బయల్దేరారు. అవతారాల్లో రేపు చివరి అవతారం శ్రీకృష్ణుని అవతారంలో స్వామివారు దర్శనమిస్తారు. ఈనెల 22, 23న ప్రధాన ఉత్సవాలైన తెప్పోత్సవం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరగనున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు. ఈ కారణంగా భద్రాద్రిలో 23 వరకు నిత్య కల్యాణాలు నిలిపివేశారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు, ఉత్తర ద్వార దర్శనం కోసం టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఉంచినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.