Solar Plant in Bhadradri Ramayya Temple : భద్రాద్రి రామునికి సౌర వెలుగులు.. రాష్ట్రంలోనే తొలి ఆలయంగా రికార్డ్

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2023, 9:09 PM IST

thumbnail

Solar Plant in Bhadradri Ramayya Temple : రాష్ట్రంలో పేరుగాంచిన ప్రత్యేక దేవాలయాల్లో భద్రాచలం సీతారాముల గుడి ఒకటి. ఈ ఆలయానికి మరో ఘనత దక్కింది. రాష్ట్రంలోనే మొదటి సోలార్​ సిస్టమ్​తో పనిచేసే దేవస్థానంగా పేరుపొందనుంది. సన్​ టెక్నాలజీ ప్రైవేట్​ లిమిటెడ్(Sun Technology Private Limited)​ ఆధ్వర్యంలో సోలార్​ సిస్టమ్​ ను దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవి ప్రారంభించారు. సుమారు రూ.2.5 కోట్లు ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేశారని ఆమె తెలిపారు. 

Solar Plant Temple in Telangana : మొదటిగా 75 కిలోవాట్లు విద్యుత్​ ఉత్పత్తి చేసే విధంగా ప్లాంట్​ను రూపొందించామని రమాదేవి అన్నారు. రాబోయే ముక్కోటి వరకు పూర్తి స్థాయిలో 500 కిలోవాట్ల ప్రాజెక్ట్​ను అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆలయాల్లో సోలార్​ ప్లాంట్(Solar Plant)​తో పనిచేస్తున్న దేవాలయంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ఇక నుంచి సోలార్​ వెలుగులతో ఆలయాన్ని మరింత ఆకర్షవంతంగా చేస్తామని పేర్కొన్నారు. ఈ సోలార్​ ప్లాంట్​ ద్వారా విద్యుత్ ఖర్చు భారీగా తగ్గుతుందని రమాదేవి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.