అశ్రునయనాల మధ్య సహారా అధినేత​ అంత్యక్రియలు- భారీగా పాల్గొన్న సన్నిహితులు

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 6:15 PM IST

thumbnail

Sahara Subrata Roy Last Rites : సహారా గ్రూప్​ అధినేత సుబ్రతా రాయ్​ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. ఉత్తరాఖండ్​.. లఖ్​నవూలో గోమది నది ఒడ్డున ఉన్న బైకుంథ్​ థామ్​లో సుబ్రతా రాయ్​ పార్థివ దేహానికి ఆయన మనమడు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బంధువులు, సన్నిహితులు... అశ్రునయనాల మధ్య వ్యాపార దిగ్గజానికి అంతిమ వీడ్కోలు పలికారు.

అంతిమ సంస్కారాల సమయంలో రాయ్ కుమారులు అందుబాటులో లేరని, అందుకే మనవడు హిమాంక్ రాయ్(16) అంత్యక్రియలు నిర్వహించారని కుటుంబ వర్గాలు తెలిపాయి. అంతకుముందు.. సహారా షహర్​ నుంచి బైకుంథ్​ థామ్​ వరకు సుబ్రతా రాయ్​ పార్థివదేహాన్ని అంతిమయాత్రగా తీసుకెళ్లారు. ఆ సమయంలో ఎస్పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​, కాంగ్రెస్​ నాయకుడు ప్రమోద్​ తివారీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

నవంబర్​ 14వ తేదీ రాత్రి సహారా గ్రూప్‌ ఛైర్మన్‌ సుబ్రతా రాయ్‌ గుండెపోటుతో మరణించారు. ఆయన చాలా కాలంగా మెటాస్టాటిక్‌ కేన్సర్‌, హై బీపీ, మధుమేహంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ హాస్పిటల్‌ అండ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆదివారం చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.