'కోటి' శివలింగాలకు ప్రత్యేక పూజలు- ప్రపంచంలోనే తొలిసారి- తెలుగురాష్ట్రాల భక్తులే ఎక్కువ!

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2023, 9:44 AM IST

Updated : Nov 19, 2023, 11:42 AM IST

thumbnail

One Crore Mortal Shivling Puja In Varanasi : ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రముఖ పుణ్యక్షేతమైన వారణాసిలో ఒకేచోట కోటికి పైగా మట్టితో తయారు చేసిన శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. లోక కల్యాణం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వారణాసిలోని శివలాఘాట్​లో విజయానందనాథ గురుసేవాసమితి ఆధ్వర్యంలో ఈ మహత్తర కార్యక్రమం.. నవంబర్​ 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనుంది. 

"దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో శివలింగాల తయారీ జరిగింది. ఆ బాధ్యతను హైదరాబాద్​కు చెందిన మహాలక్ష్మికి అప్పగించాం. ఐదువేల మంది మహిళలు లింగాలను తయారు చేసే పనిలో భాగస్వాములయ్యారు. వీటిని తయారు చేయడానికి దేశంలోని 58 కేంద్రాల్లో పదివేల మంది ఐదునెలలపాటు శ్రమించారు. ఈనెల 19 నుంచి 27 వరకు పూజలు జరగుతాయి. ఆ తర్వాత శివలింగాలను భక్తులకు పంపిణీ చేస్తాం. దీనికోసం ప్రభుత్వ సహాయం కూడా కోరాం. ఇంత పెద్ద సంఖ్యలో శివలింగాలు చేసి పూజలు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. అందువల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నిస్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాం"

-కోటి శివలింగాల పూజ కార్యక్రమ నిర్వాహకులు

కోటి శివలింగాలకు ప్రత్యేక పూజాకార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వారణాసికి తరలిరానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ మఠాలకు చెందిన పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో భాగంకానున్నట్లు వెల్లడించారు. 

Last Updated : Nov 19, 2023, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.