కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్తారు : పొంగులేటి

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 7:37 PM IST

Updated : Dec 23, 2023, 9:34 PM IST

thumbnail

Minister Uttam, Ponguleti Inspects Huzurnagar Indiramma Houses : బీఆర్ఎస్ సర్కార్‌ పదేళ్ల పాలనలో గృహ నిర్మాణాన్ని పూర్తి విస్మరించిందని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. హుజుర్‌నగర్‌ హౌసింగ్‌ కాలనీలోని ఇందిరమ్మ ఇళ్లను మంత్రులు పరిశీలించారు. హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్‌ హయాంలో మొదలుపెట్టిన 2,160 ఇళ్లను బీఆర్ఎస్ సర్కార్‌ పూర్తి చేయలేదని మండిపడ్డారు. వాటిని తుది హంగులద్ది లబ్ధిదారులకు అందిస్తామన్నారు. 

గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అఏన్ని చోట్లా ఇరిగేషన్ పనులు పెండింగ్​లో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ అప్పులపై సమాధానాలు చెప్పలేక ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ పెట్టారని ఎద్దేవా చేశారు.  కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్తారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి దుర్మారక పాలనసాగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. మధ్యలోనే ఆగిపోయిన డబుల్​బెడ్​ రూమ్‌ ఇళ్లను సైతం పూర్తి చేసి అర్హులకు కేటాయిస్తామని మంత్రులు స్పష్టంచేశారు.

Last Updated : Dec 23, 2023, 9:34 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.