Malla Reddy Viral Video : 'గొర్రెలు కాసినా.. పాలమ్మినా'.. మల్లారెడ్డి మరో వైరల్ వీడియో

By

Published : Jul 6, 2023, 2:30 PM IST

thumbnail

Minister Mallareddy New Viral Video : ప్రభుత్వ కార్యక్రమమైనా, సినిమా ఫంక్షన్‌ అయినా.. వేదిక ఏదైనా మల్లారెడ్డి ఉన్నారంటే ఆ సందడే వేరని అందరికీ తెలుసు. ఆయన మైక్‌ పట్టుకున్నారంటే చాలు.. 'కష్టపడ్డా.. పాలమ్మినా.. పూలమ్మినా.. సక్సెస్‌ అయ్యా' డైలాగ్‌ ప్రేక్షకుల నుంచి వినబడక మానదు. ఇలా.. తన మాటలతో, చేష్టలతో, ప్రసంగాలతో ఎప్పుడూ సోషల్​ మీడియా ట్రెండింగ్​లో నిలిచే మంత్రి మల్లారెడ్డి.. మరోసారి ఓ కొత్త వీడియోతో నెట్టింట హల్​చల్ చేస్తున్నారు. తాజాగా మంత్రి గొర్రెలు కాస్తున్న ఓ వీడియో సోషల్​ మీడియాలో దూసుకెళ్తోంది. ఇది చూసిన నెటిజన్లంతా.. 'పాలమ్మినా, పూలమ్మినా, ఇప్పుడు గొర్రెలు కాస్తున్నా.. అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

అసలు విషయం ఏంటంటే.. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మేడ్చల్​ మండలం గౌడవెల్లిలో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అన్ని కులాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమ ప్రాధాన్యం ఇస్తున్నారని.. మేడ్చల్ మండలానికి 15 యూనిట్లు కేటాయించారని మల్లారెడ్డి తెలిపారు. అనంతరం అక్కడే కాసేపు గొర్రెలను కాసి అందరినీ ఆకట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.