Golden Garden Award: మొక్కల్ని పెంచి అవార్డు గెలిచిన కలెక్టర్ సాబ్

By

Published : Apr 26, 2023, 4:34 PM IST

thumbnail

Jagtial Collectorate Wins Golden Garden Award: జగిత్యాల జిల్లా కలక్టరేట్ సముదాయం నందనవనాన్ని తలపిస్తోంది.  కలక్టరేట్ ప్రాంగణంలో ఎటు చూసిన పూల, పండ్ల మొక్కలు, ఎత్తైన వృక్షాలతో నిండి పోయింది. అక్కడికి వచ్చిన వారికి అహ్లాదాన్ని పంచుతూ స్వాగతం పలుకుతున్నాయి. వందలాది మొక్కలు నాటడంతో పాలనాధికారి ఆవరణం మొత్తం పచ్చదనంతో వెల్లివిరిసింది. ఆ నందనవనానికి పక్షులు వచ్చి సేద తీరుతున్నాయి. 

ఏడాది పాటు నీడ ఇచ్చేలా మొక్కలు నాటగా జగిత్యాల జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్​రావు చెట్ల పెంపకంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మొక్కల్లో ఎక్కువగా చిన్న మొక్కలపై దృష్టి పెట్టకుండా వృక్ష జాతి మొక్కలపై దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 100పై మొక్కలు ఉండగా ఔషధ, పండ్ల మొక్కలు  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అందులో 30 నుంచి 35 వరకు వృక్ష జాతులను నాటినట్లు తెలిపారు. దీంట్లో రెండు తీమ్​ పార్కులు ఏర్పాటు చేశారు, ఒకటి పంటవటి వనం, ఇంకొటి త్రిఫల వనం ఏర్పాటు చేశారు. కలక్టరేట్​లో  పచ్చదనం పెంపొందించేందుకు చెట్లను పెంచినందుకు గోల్డెన్​ గార్డెన్​ అవార్డు అందుకున్నారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.