అసైన్డ్‌ భూములకు పట్టాలు కావాలంటే కారు గుర్తుకు ఓటేయండి : హరీశ్​రావు

By ETV Bharat Telangana Team

Published : Nov 16, 2023, 7:30 PM IST

thumbnail

Harish Rao Speech at Narsapur Meeting : రూ.200 ఉన్న పింఛన్‌ రూ.2 వేలకు పెంచామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. మరోసారి బీఆర్​ఎస్​ గెలిస్తే పింఛను రూ.5 వేలకు పెంచుతామని తెలిపారు. సన్నబియ్యం కావాలంటే భారత్​ రాష్ట్ర సమితికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మెదక్​ జిల్లా నర్సాపూర్​లో నిర్వహించిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న హరీశ్​రావు ఈ మేరకు మాట్లాడారు.

BRS Election Campaign in Narsapur : ఈ సందర్భంగా మరోసారి అధికారంలోకి వస్తే సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.3 వేలు ఇస్తామని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేశామని.. హైదరాబాద్‌లో 4 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నామని చెప్పారు. రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబాలకు వారంలోపు రూ.5 లక్షలు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మూడోసారి బీఆర్​ఎస్ గెలిస్తే ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. అసైన్డ్‌ భూములకు పట్టాలు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.