PRATIDWANI : ఐటీలో నెంబర్​వన్ దిశగా తెలంగాణ పరుగులు..!

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2023, 9:29 PM IST

thumbnail

PRATIDWANI : ఐటీ రంగంలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. వార్షిక ఎగుమతులు..., కొలువుల కల్పన పరంగా.. దేశంలోనే ముందంజలో నిలుస్తోంది రాష్ట్రం. ఇది ఎవరో నోటిమాటగా చెబుతున్న ముచ్చట కాదు. 2022-23 ఆర్థిక సంవత్సరం గణాంకాలే ఇక్కడి ఐటీ రంగం జోరుకు.. అద్ధం పడుతున్నాయి. దేశంలో కొత్తగా వస్తోన్న ఐటీ ఉద్యోగాల్లో 30 నుంచి 40% తెలంగాణ నుంచే అంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ రంగంలో జోరు తాారస్థాయికి చేరింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ శాఖలను భాగ్యనగరంలో ఏర్పాటు చేసేందుకు బారులు తీరాయి. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న ప్రోత్సాహం, చౌకల లభించే మౌలిక వసతులు.. ఇవన్నీ హైదరాబాద్​ను హాట్​ స్పాట్​గా మర్చాయంటున్నాయి జాతీయ స్థాయి గణాంకాలు. మరి, ఐటీలో రాష్ట్రం ఇంతటి జోరుకు కారణాలు ఏమిటి? దేశవ్యాప్తంగా ఐటీ రేసులో తెలంగాణను, భాగ్యనగరాన్ని ఏ ఏ అంశాలు ప్రత్యేక స్థానంలో నిలుపుతున్నాయి? రానున్న రోజుల్లో తెలంగాణ ఐటీ ఇంకా ఏ స్థాయిలో, ఎలా ఉండొచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.