Pratidwani : పాఠశాల విద్య... సమస్యలు, సవాళ్లు

By

Published : Jun 12, 2023, 10:41 PM IST

thumbnail

Pratidwani : బడిగంట మోగింది. రాష్ట్రవ్యాప్తంగా... ఇవాళ పాఠశాలలు పున:ప్రారంభం అయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులంతా తిరిగి బడిబాట పట్టారు. ఈ సందర్భంగానే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఎన్నో కీలక నిర్ణయాల అమలుకు నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. మన ఊరు - మన బడితో వసతులతో కల్పనతో పాటు విద్యార్థులకు సకల సౌకర్యాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు, అధికారులు ప్రకటిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మన ఊరు - మన బడిలో భాగంగా.. అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇప్పటికే సర్వే చేశారు. అందులో ఉన్న సౌకర్యాలు, ఏర్పాటు చేయవలసిన వసతుల గురించి తెలుసుకున్నారు. వీటిపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక చేరింది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు జరిగితే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇంత వరకు బాగానే ఉన్నా... రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం ముందున్న ప్రధాన సమస్యలు, సవాళ్లు ఏమిటి? వాటి విషయంలో ఎలాంటి చర్యలు అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.