Pratidwani బడులు బాగుపడితేనే బంగారు తెలంగాణ!

By

Published : Feb 16, 2023, 11:08 PM IST

thumbnail

Pratidwani: బడులు బాగుంటేనే బాలలకు భవిష్యత్తు ఉంటుంది. బంగారు తెలంగాణాలో వేలాది ప్రభుత్వ పాఠశాలలు ఒక్క ఉపాధ్యాయుడితోనే పనిచేస్తున్నాయి. ఏకోపాధ్యాయ బడులు దేశంలో సగటున పది శాతం ఉంటే తెలంగాణలో 21శాతం ఉన్నాయి. ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక్క ఉపాధ్యాయుడే బోధించాలి. ఇవికాక బోధనేతర బాధ్యతలు కూడా చూడాలి. ఉన్న ఒక్క టీచరూ అనారోగ్యమనో, అవసరమయ్యో సెలవు పెడితే... ఆ బడికి అనధికారిక సెలవే. చాలా చోట్ల ఇదే తంతు. దానివల్ల చదువులు అటకెక్కుతున్నాయి. ఏళ్లుగా సాగుతున్న ఈ తంతుకు తెలంగాణ వచ్చిన తరువాత అయినా మార్పు కనిపిస్తుందని అంతా భావించారు. కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎనిమిది ఏళ్లు అవుతున్నా .. ఎలాంటి ప్రయోజనం కనిపించ లేదు. ప్రభుత్వం ఎన్ని పథకాలు తీసుకొచ్చినా.. నిబంధనలు మార్చినా.. మూల సమస్య పరిష్కరించకుండా చేసేదంటా పైపై మెరుగులు గానే కనిపిస్తుంది. ప్రభుత్వం పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకు రావాలని విద్యావేత్తలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు కమిటీలు వేస్తూ.. నివేదికలు తెప్పించుకుంటున్నారు .. కానీ అమలు ప్రసక్తి వచ్చే సరికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది అధికారుల తీరు. ప్రభుత్వం తరపున కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కానీ ప్రభుత్వ విధానాల్లో లోపాలను కొందరు ఉపాధ్యాయులు తమకు అనుకూలంగా మార్చుకొని ఇష్టానుసారంగా వ్యవహరించడంతో.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య బోధన అంతే అందరికి అసులుగా మారిపోయింది. కొందరు తల్లిదండ్రులు ధైర్యం చేసి తమ పిల్లలను సర్కారీ బళ్లకు పంపేందుకు ఆసక్తి చూపినా. అక్కడ వసతులు, విద్యా బోధన తీరు చూసి వెనకడుగు వేస్తున్నారు.. వీటన్నింటికి బాధ్యులు ఎవరు? ఒక ఉపాధ్యాయుడు రోజుకు 18 పీరియడ్లు బోధిస్తే.. దాని ప్రభావం టీచరు పైనా? పిల్లలపైనా ఉండదా? అసలు ఏకోపాధ్యాయ బడుల్లో ఏం జరుగుతోంది? విద్యా ప్రమాణాలపై దాని ప్రభావం ఎలా ఉంది? విద్యార్థులు-ఉపాధ్యాయులు వీరి ఇరువురి సమస్యలు ఏంటి? అనే అంశాలు నేటి ప్రతిధ్వని లైవ్‌ డిబేట్‌లో చర్చిద్దాం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.