Pratidwani : ఎన్నారై పెళ్లిళ్లు.. మోసాలకు చెక్‌ ఎలా?

By

Published : Jul 10, 2023, 10:13 PM IST

thumbnail

Pratidwani :NRI వివాహాలకు సంబంధించి బయటపడుతున్న మోసాలు... కలవర పెడుతున్నాయి. దేశంలో ఈ తరహా బాధితుల్లో గుజరాత్‌, పంజాబ్‌ తర్వాత తెలంగాణ యువతులే అధికం అన్న జాతీయ మహిళా కమిషన్ వివరాలు సమస్య తీవ్రతకు అద్ధం పడుతున్నాయి. ఇంకా లెక్కకు రాని కేసులు ఎన్నో. బాధితులంతా పోలీసుల ముందుకు వస్తే.. ఇలాంటి కేసులు ఎన్నో వెలుగు చూసే అవకాశాలున్నాయి. తల్లిదండ్రుల తొందరపాటు నిర్ణయాలే ఇలాంటి దారుణాలకు కారణమని తెలుస్తోంది. విదేశీ సంబంధాల మోజులో తమ కన్నకూతుర్ని ఎవరికి కట్టబెడుతున్నామో కూడా చూసుకోలేని స్థితిలో తల్లిదండ్రులు ఉంటున్నారని నిపుణులు చెబుతున్నారు. అసలు.... ఆనందాల హరివిల్లుగా ఊహించుకునే విదేశీ వివాహా సంబంధాలు... ఇంతగా ఎందుకు వికటిస్తున్నాయి? ఎన్నో కలలు కని తమ పిల్లల్ని వారి చేతుల్లో పెడుతున్న తల్లిదండ్రులు..., చివరకు ఆ యువతులు ఎలా మోస పోతున్నారు? ఇలాంటి పరిస్థితుల్లో విదేశాల్లోని సంబంధం అన్నప్పుడు అబ్బాయి మంచి, చెడూ వాకబు చేసుకోవడానికి ఉన్న మార్గాలు, బాధితులకు ఉపశనం కలిగించే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.