ధరణి పోర్టల్​పై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2023, 6:35 AM IST

thumbnail

Dharani Portal Issue in Telangana Election Campaign 2023 : ఎన్నికల ప్రచారంలో ధరణి పోర్టల్‌పై బీఆర్ఎస్-కాంగ్రెస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పార్టీల నేతలు.. పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ధరణి పేరుతో కేసీఆర్‌ సర్కార్‌ పేదల భూములు లాక్కొందని రాహుల్‌గాంధీ ఆరోపించగా.. పోర్టల్‌ను రద్దు చేస్తే.. మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని కేసీఆర్‌ హెచ్చరించారు. 

Telangana Congress VS BRS : అసెంబ్లీ ఎన్నికల పోరు దగ్గరపడుతుండటంతో రాజకీయ వేడి రాజుకున్న రాష్ట్రంలో.. ధరణి పోర్టల్‌ అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని పతాకస్థాయికి చేర్చింది. అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామన్న కాంగ్రెస్‌ నేతల మాటలపై ముఖ్యమంత్రి కేసీఆర్​ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం కేసీఆర్ బహిరంగ సభల్లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూడేళ్లు కష్టపడి ధరణి పోర్టల్‌ను రూపొందించానన్న కేసీఆర్.. రైతు భూమిని ఎవరూ ఆక్రమించకుండా చేశామని తెలిపారు. ధరణి పుణ్యంతోనే రైతుబంధు, రైతు బీమా అమలవుతోందని, రైతు బొటనవేలితో మాత్రమే భూమి వివరాలు మారతాయని స్పష్టం చేశారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామనే వాళ్లనే సముద్రంలో వేయాలని కేసీఆర్ సభల్లో పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.