'పోలింగ్​కు రెండు రోజుల ముందు రైతుబంధుకు ఈసీ ఎలా అనుమతిస్తుంది?'

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2023, 7:47 PM IST

thumbnail

CPI Leader Chada Intresting Comments on BRS, BJP : తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ కొట్లాడింది ఏమీలేదని.. సకల జనుల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని అణబెరి, సింగిరెడ్డి అమరుల భవన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లను చీల్చి బీఆర్ఎస్​ను గెలిపించేలా బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పోలింగ్​కు రెండు రోజుల ముందు రైతు బంధుకు ఈసీ అనుమతి ఇవ్వడంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని అర్థమవుతోందన్నారు.

బీఆర్ఎస్ పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​కు అవకాశం ఇద్దామని ప్రజలు అనుకుంటున్నరన్నారు. ప్రజలను కలవని ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. బీఆర్ఎస్​ను ఓడించడమంటే బీజేపీను ఓడించడమేనన్నారు. రాష్ట్రంలో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ అగ్ర నేతలు, మంత్రులంతా రాష్ట్రానికి వరుస కడుతున్నారని ఎద్దేవా చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చుకోవాలని.. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే కాంగ్రెస్​ను గెలిపించాలని ప్రజలను కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.