చేవెళ్ల నియోజకవర్గం సమర్థుడైన నాయకత్వం కోసం ఎదురుచూస్తోంది : భీమ్​ భరత్​

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2023, 5:29 PM IST

thumbnail

Chevella Congress Candidate Bhim Bharat Interview : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం సమర్థుడైన నాయకత్వం కోసం ఎదురుచూస్తోందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమ్ భరత్ అన్నారు. గత ఎన్నికల్లో పార్టీ సరైన అభ్యర్థిని ఎంపిక చేయకుండా తప్పు చేసిందని, ఈసారి ఆ తప్పు సరిదిద్దుకొని తనలాంటి వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టడం వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందని భరత్ తెలిపారు. హైదరాబాద్​కు అతి సమీపంలో ఉన్నా కూడా చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడిందన్నారు.

Election Campaign In Telangana : కాంగ్రెస్​ పార్టీకి చెేవెళ్ల బలమైన నియోజకవర్గం అని కొనియాడారు. కాంగ్రెస్​ పార్టీ అడ్డ-చేవెళ్ల గడ్డగా అభివర్ణించారు. తాను అధికారంలోకి వస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. చేవెళ్లను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పిస్తానని వెల్లడించారు.  స్థానిక ఎమ్మెల్యే అధిష్ఠానానికి తలవంచడం వల్లే చేవెళ్ల అభివృద్ధికి దూరమైందంటోన్న భీమ్ భరత్​తో ప్రత్యేక ముఖాముఖీ. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.