కూల్​ డ్రింక్​ పోస్తేనే సైలెంట్.. 'లాక్​డౌన్​' మేక స్టైలే వేరు గురూ!

By

Published : Jun 28, 2023, 7:05 AM IST

Updated : Jun 28, 2023, 12:00 PM IST

thumbnail

సాధారణంగా వేసవి కాలంలో ఏ జీవైనా ఎండలను తట్టుకోవడానికి నీటిని తాగుతుంది. కానీ ఓ మేక మాత్రం రోజూ కూల్​ డ్రింక్​నే తాగుతోంది. బిహార్​ భాగల్​పురల్​ని లాక్​డౌన్​ అనే మేక రోజూ కూల్​ డ్రింక్​ తాగుతోంది. ఒకవేళ ఆ రోజూ కూల్​ డ్రింగ్​ లేకపోతే.. ఇంట్లో మాములు రచ్చ చేయదు ఈ మేక. దీని కథ ఏంటో తెలుసుకుందాం పదండి..

ఇదీ కథ
తాతర్​పుర్​కు చెందిన షాహిద్​ బక్రీద్​ కోసం ఓ మేకను మూడేళ్లుగా పెంచుతున్నాడు. దీనికి లాక్​డౌన్​ అని పేరు పెట్టుకున్నాడు. దీనిని పెంచడానికి రోజుకు సుమారు రూ.100 ఖర్చుపెడుతున్నాడు. ప్రస్తుతం 80 కేజీలు ఉన్న మేక.. సుమారు రూ.లక్ష పలుకుతోందని చెప్పాడు. కానీ ఈ మేకను తాను అమ్మబోనని.. తన ఇంట్లోనే వధిస్తానని తెలిపాడు. "తొతాపురి జాతికి చెందిన ఈ మేక 2020 కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తున్న సమయంలో పుట్టింది. అందుకే దానికి లాక్​డౌన్​ అని పేరు పెట్టాను. మార్కెట్​లో సుమారు లక్ష రూపాయల ధర పలుకుతోంది. కానీ నేను దీనిని అమ్మను. ఇంట్లోనే వధిస్తాను." అని షాహిద్​ తెలిపాడు.

Last Updated : Jun 28, 2023, 12:00 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.