శరవేగంగా అయోధ్య మందిర నిర్మాణం.. ఆలయం లోపలి దృశ్యాలు చూశారా?

By

Published : Jun 29, 2023, 7:21 PM IST

thumbnail

ఆయోధ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ పైకప్పు ఏర్పాటుతో పాటు దాదాపు 90 శాతం గ్రౌండ్​ ఫ్లోర్ పని పూర్తైంది. వచ్చే ఏడాది జనవరి నాటికి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి చేసి.. అదే నెల 14 -16 తేదీల మధ్య ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, కళాకారులు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణానికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఓ వ్యక్తి ఆలయంలో తిరుగుతూ లోపలి దృశ్యాలను చూపిస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. 
2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉండనుంది. మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులుగా ఉంటుంది. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.

రామయ్యకు కానుకలు..
ఆయోధ్య రామయ్య కోసం ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో కానుకలు సిద్ధం అవుతున్నాయి. తాజాగా గుజరాత్​కు చెందిన కొందరు భక్తులు.. 3403 కిలోల బరువున్న అగరబత్తిని తయారు చేసి శ్రీరాముడిపై తమ భక్తిని చాటుకున్నారు. ఈ ఏడాది డిసెంబరు చివరికల్లా ఈ అగర్​బత్తిని అయోధ్యకు చేర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. అగరబత్తికి సంబంధించిన వీడియో చూడడానికి కింద ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.