ఉపాధి హామీ పనుల్లో వెండి నాణేల కుండ లభ్యం.. ఎక్కడంటే

By

Published : Mar 25, 2023, 4:00 PM IST

thumbnail

Ancient silver coins are found in Karimnagar: ఉపాధి హామీ పని చేస్తుండగా కూలీలకు వెండి నాణేల కుండ లభ్యమైంది. నిధి లభించిందని వారంతూ సంతోషపడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా సమానంగా పంచుకున్నారు. కూలీలు కుండను పగలగొట్టి నాణేలు పంచుకున్న విషయం కొద్ది రోజుల తర్వాత అధికారులకు తెలిసింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనిలో నాణేలు దొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  తహసీల్దార్ విచారణ చేసి నాణేలు ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. కుండలో మొత్తం 27 వెండి నాణాలు దొరికినట్టు గ్రామస్థులు తెలిపారు. ఈనెల 9వ తేదీన దొరకగా ఆరోజు 18 మంది కూలీలు పనిచేశారని గుర్తించారు. వారంతా ఎక్కడున్నారో గుర్తించే పనిలో ఉన్నారు. ఈ నాణాలు నిజాం రాజుల నాటివని, మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో 1869 నుంచి 1911 వరకు చలామణి అయ్యాయని అధికారులు తెలిపారు. తహసీల్దార్ కనకయ్య, ఎస్సై ప్రమోద్ రెడ్డి, ఎంపీడీవో రవీందర్ రెడ్డి తదితరులు విచారణలో పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.