ETV Bharat / sukhibhava

వాకింగ్‌, యోగా- వీటిలో బరువు తగ్గడానికి ఏది బెస్ట్‌ ఆప్షన్ ? నిపుణుల మాటేంటి!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 12:12 PM IST

Walking Vs Yoga Which Is Best For Weight Loss
Walking Vs Yoga Which Is Best For Weight Loss

Walking Vs Yoga Which Is Best For Weight Loss : అధిక బరువు.. ఇప్పటి జనరేషన్‌ను వేధిస్తున్న అతి పెద్ద సమస్య. దీనికి చెక్ పెట్టడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, చాలా మందిలో బరువు తగ్గడానికి వాకింగ్ మంచిదా ? లేదా యోగా ? అనే సందేహాం కలుగుతుంటుంది. వీటిలో ఏది బరువు తగ్గడానికి బెస్ట్‌ ఆప్షనో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Walking Vs Yoga Which Is Best For Weight Loss : ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా విపరీతంగా బరువు పెరుగుతున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. బడికెళ్లే వయసు నుంచే ఒత్తిడి పెరగడం, శారీరక శ్రమ లేని ఉద్యోగంలో గంటలు గంటలు కూర్చోని పని చేయడం.. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వంటివి అధిక బరువుకు కారణమవుతున్నాయి. చాలామంది ఈ సమస్య నుంచి బయట పడటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొద్దిమంది నడక మొదలుపెడితే.. మరికొద్దిమంది యోగాసనాలు వేస్తారు. ఇంతకీ ఈ రెండింటిలో ఏది బెటర్​ అనే డౌట్​ చాలా మందికి వస్తుంది. మరి ఈ ప్రశ్నకు నిపుణులు ఏం అంటున్నారో ఈ స్టోరీలో చూద్దాం..

నడక వల్ల కలిగే లాభాలు : వాకింగ్​, యోగా ఈ రెండింటి వల్ల బరువు తగ్గొచ్చని నిపుణులు అంటున్నారు. జిమ్‌కు వెళ్లడం ఇష్టం లేని వారికి వాకింగ్ ఒక మంచి ఎంపిక. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేస్తుంది. క్రమం తప్పకుండా వాకింగ్​ చేయడం వల్ల అదనపు క్యాలరీలు, పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తక్కువ సమయంలోనే కరుగుతుంది. అలాగే వాకింగ్​ వల్ల మీ కండరాలు దృఢంగా మారుతాయి. ప్రతిరోజు వాకింగ్‌ చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వాకింగ్​ చేయడం వల్ల ఒత్తిడి, భయం, కోపం వంటి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండవచ్చు. శరీరం ఫిట్​గా ఉంటే గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవు. మీరు రెగ్యులర్​గా మార్నింగ్ వాకింగ్‌ చేస్తూ సమతుల ఆహారం తీసుకుంటే ఈజీగా బరువు తగ్గొచ్చని నిపుణులు అంటున్నారు.

ల్యాప్​టాప్​ ఒడిలో పెట్టుకుని వర్క్​ చేస్తున్నారా? బీ కేర్​ ఫుల్​- ఈ సమస్యలకు వెల్​కమ్​ చెప్పినట్లే!

యోగాతో లాభాలు : ఎలాంటి అనారోగ్యాన్నైనా, మానసిక సమస్యలనైనా దూరం చేసే శక్తి యోగాకు ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. యోగాతో బరువు తగ్గడం సాధ్యమే కానీ, ఈ ప్రక్రియ కొంత నెమ్మదిగా సాగుతుంది. ప్రతిరోజు యోగా అభ్యాసం చేయడం వల్ల శరీరంలోని కొవ్వు కణాలు కరుగుతాయి. యోగాసనాలు వేయడం ద్వారా శారీరక శ్రమ పెరిగి, కొవ్వు కరుగుతుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ రెండూ కూడా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయని చెబుతున్నారు. అయితే మీ శరీరానికి ఏది మంచిదో వైద్యులను సంప్రదించి ఆచరించడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయంటున్నారు.

గమనిక: ఇది కేవలం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం.

తిన్న తర్వాత కూల్​డ్రింక్స్, సోడా తాగుతున్నారా? - అయితే మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే!

బీట్‌రూట్‌ ఇలా ఉపయోగిస్తే మొటిమలు, మచ్చలు దూరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.