ETV Bharat / sukhibhava

చలికాలంలో బద్ధకాన్ని వదిలి బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ టిప్స్​ ట్రై చేయండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 1:58 PM IST

How To Loss Weight In Winter
How To Loss Weight In Winter

How To Loss Weight In Winter : బరువు తగ్గాలనుకునే వారు అప్పటివరకు చేసిన పలు ప్రయత్నాలను చలికాలం రాగానే వాయిదా వేస్తుంటారు. కారణం.. వాతావరణం చల్లగా ఉండటంతో పాటు పొద్దున లేవడానికి బద్ధకం. ఇలాంటి వారు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Loss Weight In Winter : మనలో చాలా మంది బరువు తగ్గాలని కొన్ని నెలల నుంచి కష్టపడుతుంటారు. ఉదయాన్నే వాకింగ్‌, జాగింగ్ వంటివి చేయడానికి పార్కులకు, మైదానాలకు వెళ్తుంటారు. కానీ, చలికాలం వచ్చే సరికి కొంతమంది వ్యాయమాలకు, వాకింగ్‌లకు బ్రేక్​ వేస్తారు. ఉదయాన్నే వీచే చలిగాలులకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే దుప్పటి ముసుగేసి హాయిగా నిద్రపోతారు. ఇలాంటి వారిని మనం చాలా మందిని చూసి ఉంటాం. అయితే చలికాలంలో బరువు తగ్గాలి అని అనుకునేవారు ఇంట్లోనే ఉండి కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం వారు ఐదు మార్గాలను సూచించారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

5 Tips to Loss Weight in Winter:

నీళ్లను తాగడం : చాలా మంది చలికాలంలో నీటిని తక్కువగా తాగుతారు. ఇలాంటి వారు ఉదయాన్నే గోరు వెచ్చని నీటిని తాగాలి. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో వ్యాయమాలు, వాకింగ్, జాగింగ్ వంటివి చేయని వారు ఉదయాన్నే గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గోరు వెచ్చని నీరు తాగడం వల్ల కడుపు నిండినట్లు అనిపించి, ఆకలి తగ్గుతుంది. దీనివల్ల తక్కువగా తింటారు. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వెచ్చదనం కోరుకునే వారు గ్రీన్‌ టీ, హెర్బల్ టీలను కూడా తీసుకోవచ్చు.

మీకు బ్లూ టీ గురించి తెలుసా? బరువు తగ్గి నాజూగ్గా మారిపోతారు!

స్నాక్స్‌గా తృణధాన్యాలు: చాలా మంది చలికాలంలో వేడివేడిగా బయట దొరికే చిరుతిళ్లను తినడానికి ఆసక్తి చూపిస్తారు. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, సాయంత్రం స్నాక్‌గా తృణధాన్యాలను తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. తృణధాన్యాలలో తక్కువ కేలరీ, ఎక్కువ ఫైబర్‌లు ఉంటాయి. దీనివల్ల కడుపుని నిండి, ఆకలి తగ్గుతుంది. మీకు ఇష్టమైతే డ్రైఫ్రూట్స్ కూడా తినవచ్చు.

నిద్ర: బరువు తగ్గాలనుకునేవారు తగినంత నిద్రపోవడం ముఖ్యమని నిపుణులు తెలియజేస్తున్నారు. కనీసం రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని అంటున్నారు. లేకపోతే హార్మోన్ల సమతుల్యతను దెబ్బతిని, ఆకలి పెరుగుతుంది. దీనివల్ల బరువు పెరగుతారని చెబుతున్నారు.

వ్యాయామాలు : బయట బాగా చలిగా ఉన్నప్పుడు చాలా మంది వర్కవుట్‌లు చేయడానికి ఆసక్తి చూపరు. ఇలాంటి వారు కొన్ని తేలికపాటి డంబెల్స్‌ను కొనుగోలు చేసి వ్యాయమాలను ఇంట్లోనే ప్రారంభించవచ్చు. దీనివల్ల కొంత శారీరక శ్రమ కలిగి బరువు తగ్గుతారు. అలాగే యోగా, ధ్యానం వంటివి చేసి మనసును తెలికపరచుకోవచ్చు.

అవుట్‌డోర్‌ వర్కవుట్స్‌ : ఉదయాన్నే చలి తీవ్రత తగ్గిన తరవాత నడక, పరుగు లేదా సైక్లింగ్ వంటివి తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. వ్యాయామం చేయడం వల్ల క్యాలరీలు కరిగి బరువు తగ్గుతారు. దీనివల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.

Note : ఏదైనా కొత్త ఆరోగ్య చిట్కాలను ప్రారంభించే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించి వారి సలహాలు, సూచనలను తీసుకోండి.

పెడిక్యూర్​ కోసం పార్లర్​కు వెళ్తున్నారా? - పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసుకోని పాదాల అందం పెంచుకోండి!

యవ్వనంలో స్లిమ్​గా ఉండి - ఆ తర్వాత బరువు పెరిగారా? అసలైన కారణమిదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.