ETV Bharat / state

కూలిన బతుకులు.. మూడు కుటుంబాలకు ఎంపీ కోమటిరెడ్డి ఆర్థిక సాయం

author img

By

Published : Apr 30, 2022, 4:59 PM IST

Updated : Apr 30, 2022, 7:32 PM IST

Building Collapsed in Yadagirigutta: శిథిలావస్థకు చేరిన ఓ రెండంతస్తుల భవనం ముందు భాగం కూలి... నలుగురు మృతిచెందిన ఘటన యాదగిరిగుట్ట వాసులను ఉలికిపాటుకు గురిచేసింది. నలుగురు మృతుల్లో ముగ్గురు వారి కుటుంబాలకు పెద్ద దిక్కు. వీరంతా అనుకోని ప్రమాదంలో విగతజీవులుగా మారడంతో కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. మూడు కుటుంబాలకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు.

కూలిన బతుకులు.. మూడు కుటుంబాలకు ఎంపీ కోమటిరెడ్డి ఆర్థిక సాయం
కూలిన బతుకులు.. మూడు కుటుంబాలకు ఎంపీ కోమటిరెడ్డి ఆర్థిక సాయం

Building Collapsed in Yadagirigutta: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రెండంతస్తుల భవనం ముందు భాగం(బాల్కనీ) కూలిన ఘటనలో మృతులందరిదీ హృదయ విదారకర పరిస్థితులే ఉన్నాయి. బాల్కనీ కిందే ముగ్గురు స్నేహితులు మాట్లాడుతుండగా ఒక్కసారిగా అది కుప్పకూలడంతో అక్కడికక్కడే వారందరూ మృతిచెందగా... వేరే ఒకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. వీరిలో ముగ్గురు యువకులే. నలుగురు మృతుల్లో ముగ్గురు వారి కుటుంబాలకు పెద్ద దిక్కు. అందులో ఇద్దరికీ పదేళ్ల లోపు ఇద్దరిద్దరు ఆడపిల్లలు ఉండగా.. మరొకరికి ఏడాదిన్నర వయసున్న పాప, నిండు గర్భిణి అయిన భార్య ఉన్నారు.

విలపిస్తున్న కుటుంబీకులు
విలపిస్తున్న కుటుంబీకులు

ఒక్కసారిగా నలుగురి మృతితో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుండ్లపల్లి దశరథ (70), శ్రీనాథ్ (38), ఉపేందర్(38), శ్రీనివాస్​(40) మృతితో కుటుంబీకులతో పాటు సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. పట్టణ పరిసరాల్లో బాధితుల రోదనలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. భువనగిరి ఏరియా ఆసుపత్రిలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య వారి అంత్యక్రియలు ముగిశాయి. మరోవైపు యాదగిరిగుట్టలో ఘటనా స్థలాన్ని రాచకొండ క్రైమ్​ డీసీపీ యాదగిరి పరిశీలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఘటన జరిగిన స్థలం
ఘటన జరిగిన స్థలం
ఘటనాస్థలిని పరిశీలించిన డీసీపీ యాదగిరి
ఘటనాస్థలిని పరిశీలించిన డీసీపీ యాదగిరి

యాదగిరిగుట్టలో నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరం. మా ముగ్గురు మిత్రులు ఈ ఘటనలో చనిపోయారు. మరో మిత్రుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ ముగ్గురు పనిచేస్తేనే వారి కుటుంబాలు బతికే దుర్భర పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఆ కుటుంబాలకు ప్రభుత్వం రూ.25లక్షల చొప్పున ప్రకటించాలని కోరుకుంటున్నాం. దిక్కులేని ఆ కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాం. -మృతుల మిత్రుడు

వాళ్లను చూసుకునేవాళ్లు ఎవరూ లేరు ఇంట్లో పెద్దదిక్కు ఆయనే. ఇప్పుడు ఆయనే చనిపోయాడు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. వారికి పరిహారం చెల్లించాలి. -స్థానికురాలు

ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి..

మృతుల కుటుంబాలకు ఎంపీ ఆర్థిక సాయం: మృతి చెందిన నలుగురు కుటుంబ సభ్యులను భువనగిరి ఏరియా ఆసుపత్రి వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. మూడు కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. మృతులు పేదవారని.. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు. కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారమివ్వాలని కోరారు. ఇది ప్రభుత్వం బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్​తో మాట్లాడానని, ముఖ్యమంత్రికి కూడా లేఖ రాస్తానన్నారు. మీడియా ద్వారా కేసీఆర్​కి విజ్ఞప్తి చేస్తున్నామన్న ఆయన.. వారి కుటుంబాలను తప్పకుండా ఆదుకోవాలన్నారు.

ప్రభుత్వాసుపత్రుల్లోని మార్చురీల్లో వసతులు లేవు, ఫ్రీజర్లు లేవని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. భువనగిరి, ఆలేరు ఆసుపత్రులకు మూడు చొప్పున ఫ్రీజర్లు అందించనున్నామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రకటించారు. ఎంపీ ల్యాండ్స్ నిధులనుంచి 20 లక్షల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. పిల్లల ఆసుపత్రుల్లో కిటికీలు, ఫ్యాన్లు, ఏసీలు లేకుంటే వాటిని తామే సమకూర్చానని కోమటిరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నా.. ఆసుపత్రి అవసరాలను గుర్తించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మృతులు పేదవారు.. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారమివ్వాలి. ప్రభుత్వాసుపత్రుల్లోని మార్చురీల్లో వసతులు, ఫ్రీజర్లు లేవు. భువనగిరి, ఆలేరు ఆస్పత్రులకు మూడు చొప్పున ఫ్రీజర్లు అందిస్తాం. ఫ్రీజర్ల కోసం ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.20 లక్షలు కేటాయిస్తున్నా. పిల్లల ఆస్పత్రుల్లో కిటికీలు, ఫ్యాన్లు, ఏసీలు లేవు. ఆస్పత్రుల అవసరాలను ప్రభుత్వం గుర్తించడం లేదు. -కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ

మూడు కుటుంబాలకు ఎంపీ కోమటిరెడ్డి ఆర్థిక సాయం

ఇవీ చదవండి:

Last Updated : Apr 30, 2022, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.