ETV Bharat / state

Governor Tamilisai Warangal tour : 'ఎవరిని కదిపినా కన్నీళ్లే.. ఏ గడపను తట్టినా విషాదమే.. ఓరుగల్లును చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది'

author img

By

Published : Aug 2, 2023, 1:20 PM IST

Updated : Aug 2, 2023, 4:40 PM IST

tamilisai
tamilisai

Governor Tamilisai visits Flood Affected Warangal Rains 2023 : వరంగల్ జిల్లాలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ పర్యటించారు. జిల్లాలోని వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు. వరద బాధితులను కలిసి వారితో మాట్లాడారు. వరద ప్రాంతాలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓరుగల్లు వరద బాధితులను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు.

'ఎవరిని కదిపినా కన్నీళ్లే.. ఏ గడపను తట్టినా విషాదమే.. ఓరుగల్లును చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది'

Governor Tamilisai Visited Warangal Flood Affected Areas : పది రోజుల పాటు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాల వారి జీవితాలను అస్తవ్యస్థంగా మార్చాయి. ఇళ్లు కోల్పోయి కొందరు.. పంట పొలాల్లో నీటమునిగి మరికొందరు.. వరదల్లో ఆత్మీయులతో పాటు సర్వం కోల్పోయి ఇంకొందరు.. ఇలా వరద బీభత్సం ఎంతో మంది జీవితంలో కల్లోలం సృష్టించింది. ముఖ్యంగా భారీ వర్షాలు-వరదలు ఉమ్మడి వరంగల్​ జిల్లాను ముప్పుతిప్పలు పెట్టాయి. ఆ జిల్లాలో ఎవరిని కదిపినా కంటనీరే.. ఎవరితో మాట్లాడినా గొంతు నిండా విషాదమే కనిపిస్తోంది.

Governor Tamilisai visits Flood Affected Warangal : వరద మిగిల్చిన విషాదంతో ఇప్పుడిప్పుడే ఇళ్ల బాట పడుతున్న వారికి వారి ఇళ్లను చూస్తే గుండె పగిలేటంతటి బాధ వేస్తోంది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టినా కూలిన ఇళ్లకు, నీటమునిగిన పంటపొలాలను చూసి బాధితులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికీ సరైన హామీ ప్రకటించకపోవడంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నా వారికి సరైన భరోసా కల్పించలేకపోతున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఇళ్లు కూల్పోయామంటూ ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుతున్నారు.

Hanamkonda Floods 2023 : తాజాగా ఓరుగల్లులో రాష్ట్ర గవర్నర్ తమిళిసై పర్యటించారు. ఉమ్మడి వరంగల్​లోని ముంపు ప్రాంతాలను సందర్శించి బాధితుల గోడు విన్నారు. మొదట పలు ముంపు ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించిన గవర్నర్.. అనంతరం ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన గవర్నర్​కు అర్చకులు పూర్ణకుంభంలో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తమిళిసై.. మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందుగా హనుమకొండలోని జవహర్​నగర్, నయీమ్​నగర్, పోతననగర్ ముంపుప్రాంత ప్రజలను పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు, ఆరోగ్యకిట్లను అందజేశారు. భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం హంటర్ రోడ్డులోని ఎన్టీఆర్​ నగర్​తోపాటు ఎన్​ఎన్​నగర్ ముంపు ప్రాంతాలను గవర్నర్ సందర్శించారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని బాధితులు గవర్నర్ ఎదుట వాపోయారు.

"వరదలకు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. మన అక్కలు, అన్నదమ్ములు ఇలా వరదల కారణంగా ఇబ్బందిపడడం చాలా బాధాకరంగా ఉంది. వరంగల్ వరద బాధితులను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. రెండు రోజుల క్రితం వరదలు చాలా భీభత్సంగా ఉన్న సమయంలో నేను వీడియోకాన్ఫరెన్స్​లో అధికారులతో సమావేశమయ్యాను. నేను వారికి విజ్ఞప్తి చేశాను. వారు తక్షణమే చర్యలు చేపట్టారు. వారి చేసిన నిరంతరమైన సేవకు ధన్యవాదాలు చెప్పాలి. ఎన్జీవోలు ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా సహాయం చేశారు." - తమిళిసై సౌందరరాజన్​, తెలంగాణ గవర్నర్​

ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి: వరదలతో వరంగల్​ జనజీవనం అస్తవ్యస్థంగా మారిందని.. ప్రభావిత ప్రాంతాలన్నింటిపైనా ప్రభుత్వం వెంటనే ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. ఇటీవల భారీ వర్షాలు, వరదలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై పర్యటించారు. హనుమకొండ జవహర్‌నగర్‌లో వరద ప్రాంతాన్ని పరిశీలించి.. బాధితులను పరామర్శించారు. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో హెల్త్ కిట్స్, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వర్షాన్ని, వరదలను నియంత్రించలేమని.. ఇలాంటి పరిస్థితికి గల కారణాలపై దృష్టి సారించాలని చెప్పారు. భవిష్యత్తులో ఈ పరిస్థితి తలెత్తకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వరదల తర్వాత తలెత్తే సమస్యల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చాలామంది విద్యార్ధుల ధ్రువపత్రాలు వరదల్లో కొట్టుకుపోయాయని... విశ్వవిద్యాలయాలు కొత్తవి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని గవర్నర్​ అధికారులకు తెలిపారు. మొదట హైదరాబాద్ నుంచి నేరుగా వరంగల్​ నిట్​కు వచ్చిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​కు హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు, గ్రేటర్ వరంగల్ కమిషనర్, పోలీసు అధికారులు సాదర స్వాగతం పలికారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 2, 2023, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.