ETV Bharat / state

Godawari Banks are washed away Due to Rains : కోతకు గురవుతున్న గోదావరి కరకట్టలు

author img

By

Published : May 25, 2023, 3:59 PM IST

Updated : May 25, 2023, 7:28 PM IST

Godawari Banks are washed away Due to Rains : వానాకాలం వస్తోందంటే చాలు గోదావరి గట్టుపై ఉన్న గ్రామాలు వణికిపోతున్నాయి. గతేడాది జులైలో వచ్చిన భారీ వరద ఉద్ధృతే ఇందుకు కారణం. ఏటా ఒకటి రెండు మీటర్ల తీరం కోతకు గురవుతూ వస్తుండగా దీనికి భిన్నంగా గతేడాది కొన్ని చోట్ల అయిదు నుంచి పదిమీటర్ల వరకు గట్టుకు కోత పెట్టి పొలాలను నది కలిపేసు కుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా వరకు నది వెడల్పు చాలా చోట పెరిగింది. ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు తీరం కోతలకు గురైంది. వందల ఎకరాల పొలాలు రూపురేఖలు కోల్పోయాయి. వరదలకు జరిగిన నష్టం, రక్షణ చర్యలపై అధ్యయనానికి నీటిపారుదల శాఖ కమిటీని ఏర్పాటు చేసింది.

Godawari Banks are washed away Due to Rains
కోతకు గురవుతున్న గోదావరి కరకట్టలు

కోతకు గురవుతున్న గోదావరి కరకట్టలు

Godawari Banks are washed away Due to Rains : ఏటూరునాగారం- మంగపేట మధ్య ఉన్న గోదావరి కరకట్ట గతేడాది జులైలో వచ్చిన భారీ వరదలకు అనేకచోట్ల ఇలా కోతకు గురైంది. రొయ్యూరు సమీపంలో కట్ట నిలువునా కోతకు గురైంది. ఇక్కడ గోదావరి వంపు తిరుగుతుండటంతో నీళ్లు సుడులు తిరిగి కరకట్ట దెబ్బతింటోంది. కొంచెం కొంచెం కోస్తూ గతేడాది భారీగా దెబ్బతీసింది. కొన్నిచోట్ల పది మీటర్లలోపే వెడల్పు మిగిలింది. ఈ కట్ట కోతకు గురైందంటే ఏటూరునాగారం, మంగపేట పట్టణాలకు కూడా ముప్పు తప్పదని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తక్షణ మరమ్మతులు కింద తాత్కాలిక పనులు చేపడుతున్నారని.. శాశ్వత పరిష్కారం కరవైందని వాపోతున్నారు.

మరమ్మతుల నిధులకై స్పష్టత లేదు : గతేడాది జులై 15న గోదావరికి వచ్చిన భారీ వరదలు ఏటూరు నాగారం పరిసర ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించాయి. పది రోజుల పాటు వరద పెద్దఎత్తున ప్రవహించింది. నిర్మల్, మంచిర్యాల జిల్లా ఇద్దరణల్లోనూ పరీవాహకంలో ముంపు ఏర్పడింది. భద్రాచలం, బూర్గంపాడు. మణుగూరు, అశ్వాపురం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో గ్రామాలు మునిగిపోయాయి. నది ఒడ్డున ఉన్న పొలాలు, చెలకలు కోతకు గురయ్యాయి. వీటన్నింటిపై నీటిపారుదల, రెవెన్యూ శాఖలు సర్వేలు నిర్వ హించాయి. నది ముంపుపై నీటిపారుదల శాఖ ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. అయినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత మరమ్మతులకు సంబంధించిన ప్రణాళిక, నిధులు విడుదలపై స్పష్టత రాలేదు.

గుత్తేదారు పనులు పూర్తి స్థాయిలో కాలేదు : ఏటూరునాగారం-మంగపేట మండలాల్లో గోదావరికి మలుపులు ఉన్నాయి. దీంతో ప్రవాహం ఒకవైపు చొచ్చుకుని వస్తోంది. దీంతో 1990లో తీర ప్రాంతాల రక్షణకు 10.64 కిలోమీటర్ల పొడవుతో కట్ట నిర్మించారు. గతేడాది ఇది చాలా చోట్ల కోతపడింది. 5.9 కిలోమీటర్ల నుంచి 6.9 కిలోమీటర్ల మధ్య పాడయింది. అక్కడి నుంచి 7.7 కిలోమీటర్ల మధ్య కూడా లోపలి భాగం మట్టి కొట్టుకు పోయింది. రివిట్మెంట్ కనిపించకుండా పోయింది. వాస్తవానికి ఈ కట్ట శాశ్వత స్థాయిలో మరమ్మతులకు ఉమ్మడి రాష్ట్రంలోనే టెండర్లు పిలిచినా గుత్తేదారు పనులు పూర్తి స్థాయిలో చేయలేదు.

నిధుల విడుదలలో కూడా జాప్యం : 2022లో మరొక గుత్తేదారుకు ఈ పనులు అప్పగించారు. పనులు ప్రారంభించేలోగా వరదలు చుట్టుముట్టాయి. పూర్తిస్థాయి మరమ్మతులకు భారీగా నిధులు అవసరం ఉన్నా.. తక్షణ మరమ్మతులకు రూ.4.57 కోట్లు కేటాయించారు. కొన్నిచోట్ల ఇసుక బస్తాలు నింపడం, గ్రావెల్ పోయడం లాంటి పనులు జరుగుతున్నా చాలా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మరమ్మతులకు ముందడుగు పడటం లేదు. కట్టను బాగుచేసేందుకు ఆప్రాన్ నిర్మాణం, గ్రావెల్ పోయడం, చెట్ల తొలగింపు, రివిట్మెంట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. మరమ్మతులకు సంబంధించిన నిధుల విడుదల్లో కూడా జాప్యం చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లోనే వానాకాలం ప్రారంభం కానుంది. వర్షాలు కురిస్తే పనులు చేపట్టడం చాలా కష్టం. నదిలో ప్రవాహం ప్రారంభం కాకున్నా మట్టి పనులు ముందుకు కదలడం లేదని స్థానికులు చెబుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సూచిస్తున్నారు.

ముంపు బారిన పడ్డ గ్రామాలు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత వరదల్లో వందకుపైగా గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. భద్రాచలం, బూర్గంపాడు వద్ద నదికి రెండువైపులా వరద విస్తరించింది. ఎగువన ఒకవైపు మణుగూరు, అశ్వాపురం, మరోవైపు చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో నాలుగు రోజుల పాటు వరద పోటెత్తింది. భద్రాచలం పట్టణంలోకి కూడా చేరింది. దీంతో ముంపు నుంచి శాశ్వత రక్షణ కల్పించేందుకు రూ.1585 కోట్లతో 58 కిలోమీటర్లు లేదా రూ.1625 కోట్లతో 65 కిలో మీటర్ల పొడవున కరకట్టలు నిర్మించాలని ఇంజినీర్లు ప్రతిపాదనలు రూపొందించినా అవి దస్త్రాలకే పరిమితమయ్యాయి.

ఇవీ చదవండి:

Last Updated : May 25, 2023, 7:28 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.