ETV Bharat / state

'వైకుంఠధామాల పనులు గడువులోగా పూర్తి చేయాలి'

author img

By

Published : Mar 18, 2021, 7:37 PM IST

vikarabad district  collector pausumi basu  review on palle pragathi  development works
'వైకుంఠధామాల పనులు గడువులోగా పూర్తి చేయాలి'

గ్రామాల్లో వైకుంఠధామాల పనులను గడువులోగా పూర్తి చేయాలని వికారాబాద్​ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సర్పంచులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు. పలు గ్రామాల్లో జరుగుతున్న పల్లె ప్రగతి అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు.

మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకంలో కూలీల పెంపుపై గ్రామాల్లో ప్రచారం చేయాలని వికారాబాద్​ పాలనాధికారి పౌసుమి బసు అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠధామాల మార్చి 25 లోగా పూర్తి చేయాలని గ్రామాల్లోని సర్పంచులను ఆదేశించారు. మార్పల్లి మండలం సిరిపురం, కోత్లాపూర్, బూచన్​పల్లి, దామస్తపూర్ గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. నిర్మాణ పనుల పూర్తి బాధ్యత గ్రామ సర్పంచులదేనన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలతో ముగియనున్నందున అసంపూర్తిగా ఉన్న పనులకు నిధులు రావని తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేసిన వారికి బిల్లులు చెల్లిస్తామని కలెక్టర్​ స్పష్టం చేశారు.

కూలీ పెంపుపై ప్రచారం చేయండి:

నరేగా పథకం కింద గ్రామాల్లో కూలీలు చెల్లిస్తున్న వివరాలను కలెక్టర్ పౌసుమి బసు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉపాధి హామీ కూలీలందరూ పనికి వచ్చేలా చూడాలన్నారు. ప్రస్తుతమున్న కూలీ రూ.190 నుంచి రూ.237లకు పెంపుపై గ్రామాలలో దండోరా వేయించాలని ఆమె సూచించారు. పని ప్రదేశంలో కూలీలకు ఓఆర్​ఎస్​ పాకెట్లు, మంచి నీటి సదుపాయం, షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ కార్యదర్శులు, ఎంపీవోలు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించాలని ఆదేశించారు. బూచేనెల్లి గ్రామంలో కమ్యూనిటీ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలను పాలనాధికారి పరిశీలించారు. పండ్ల మొక్కలు నాటి, బెంచీలు ఏర్పాటు చేయాలని.. పిచ్చి మొక్కలు తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేశ్​ బాబు, మండల స్పెషల్ ఆఫీసర్ వరప్రసాద్, పీఆర్​ ఇంజినీరింగ్ అధికారులు, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, గ్రామ సర్పంచులు మల్లయ్య, జైపాల్ రెడ్డిలు, ఎంపీవో, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 2.10 కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.