ETV Bharat / state

'యాగాలు చేస్తే కేసీఆర్ గొప్ప హిందువా?'

author img

By

Published : Dec 17, 2019, 7:58 PM IST

Bjp laxman on cm kcr over the issue of state development
'యాగాలు చేస్తే కేసీఆర్ గొప్ప హిందువా?'

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ పంక్షన్​లో భాజపా కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ యాగాలు చేసినంత మాత్రాన... గొప్ప హిందువేమీ కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. సూర్యాపేట బాలాజీ ఫంక్షన్ హాల్​లో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. కులం మతం పేరుతో కాంగ్రెస్, తెరాస ఓటు రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. పౌరసత్వ బిల్లును రాజకీయ స్వార్థం కోసం విమర్శిస్తున్నాయన్నారు.

దేశాన్ని విడగొట్టిన పాపం కాంగ్రెస్​కే చెందుతుందని.. దేశ ప్రయోజనాలు కాంగ్రెస్​కు పట్టవని విమర్శించారు. ఒవైసీ సోదరుల ఎజెండా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. గొప్ప హిందువునని చెప్పుకుంటున్నాడని విమర్శించారు. యాగం చేసినంత మాత్రాన గొప్ప హిందూవేమి కాదని... రావణాసురుడు కూడా యాగం చేశాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యజ్ఞయాగాలు చేసేది తెలంగాణ ప్రజల కోసం కాదని తన కుమారుని గట్టెక్కించేందుకే యాగం చేస్తున్నట్లు లక్ష్మణ్ ఆరోపించారు.

'యాగాలు చేస్తే కేసీఆర్ గొప్ప హిందువా?'

ఇదీ చూడండి: ఆగని రాక్షసత్వం: మతిలేని యువతిపై అమానవీయకాండ!

Intro:Slug :.
TG_NLG_21_17_BJP_LAXMAN_AB_TS10066

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , కం , సూర్యపేట.

( ) ముఖ్యమంత్రి కేసీఆర్ యాగాలు చేసినంత మాత్రాన గొప్ప హిందువేమీ కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. సూర్యపేట బాలాజీ ఫంక్షన్ హాల్ లో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్ కులం మతం పేరుతో కాంగ్రెస్ , టిఆర్ఎస్ ఓట్ల రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. పౌరసత్వ బిల్లును రాజకీయ స్వార్ధం కోసమీ విమర్శిస్తున్నాయని అన్నారు. నెహ్రు చేసిన తప్పిదాల వల్ల దేశం ఇప్పటికే ఫలితాలు అనుభవిస్తూనే ఉందన్నారు. దేశాన్ని విడగొట్టిన పాపం కాంగ్రెస్ కే చెందుతుందన్న లక్ష్మణ్ దేశ ప్రయోజనాలు కాంగ్రెస్ కు పట్టవని విమర్శించారు. పాకిస్థాన్ లో హిందూ మైనార్టీల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంటే మన దేశంలో మైనార్టీల సంఖ్య పెరుగుతున్న విషయం దేశ గొప్పతనాన్ని నిదర్శనమన్నారు. ఒవైసీ సోదరుల ఎజెండా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరో వైపు గొప్ప హిందువుగా చెప్పుకుంటాడాని విమర్శించారు. యాగం చేసినంత మాత్రాన గొప్ప హిందూవేమి కాదని... రాక్షసుడైన రావణాసురుడు కూడా యాగం చేశాడని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యజ్ఞయాగాలు చేసేది తెలంగాణ ప్రజల కోసం కాదని తన కుమారుని గట్టెక్కించేందుకే యాగం చేస్తున్నట్లు లక్ష్మణ్ ఆరోపించారు. లోకకళ్యాణం కోసం కాకుండా కేసీఆర్ స్వార్థం కోసమే యాగం చేస్తున్నాడని లక్ష్మణ్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు ఎక్కడికక్కడే ఆగిపోయాని అన్నారు. షాదీ ముబారక్ , కళ్యాణ లక్ష్మి, రైతుబంధు వంటి అన్ని పథకాలు ఆగిపోయాయని అన్నారు.గొప్పల కోసం లక్ష కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం 80 వేల కోట్ల రాబడిలో 20 వేల కోట్ల మేరకు మద్యం మీదనే ఆదాయం జమఆవుతుందని అన్నారు. విచ్చల విడి మద్యం అమ్మకాలతో రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని ఆక్షేపించారు . రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బిజెపి అని అన్నారు బిజెపి ప్రభావాన్ని గుర్తించిన ఆయా పార్టీల నాయకులు తమ పార్టీలోకి చేరేందుకు సిద్ధం అవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వం అన్నారు. బ్రహ్మాస్త్రానికి మించిన అస్త్రాన్ని తెలంగాణలో బిజెపి అమలు చేయబోతోందని వెల్లడించారు. బిజెపి దాటికి టిఆర్ఎస్ గద్దె దిగక తప్పదని పేర్కొన్నారు. టీఆరెస్ లో చాలామంది బాహుబలిలు ఉన్నట్లు చెబుతున్న ఆ పార్టీ అగ్ర నాయకులు ఎంతమంది కట్టప్పలు ఉన్నారో తేల్చుకోలేకపోతున్నారని ఎద్దేవ చేశారు....బైట్
1. లక్ష్మణ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు.
Body:MmConclusion:న్న
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.