ETV Bharat / state

Harish Rao Participated in Bonalu Celebrations : 'ప్రపంచవ్యాప్తంగా బోనాలు జరుపుకోవడం ఆనందంగా ఉంది'

author img

By

Published : Jul 16, 2023, 6:49 PM IST

Lal Darwaza Bonalu 2023 in Hyderabad : సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టినట్లు సిద్దిపేటలో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని మం‌త్రి హరీశ్‌రావు తెలిపారు. పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు కులమతాలకు అతీతంగా పండుగ జరుపుకుంటున్నారన్న మంత్రి.. అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు.

Harish rao Visit Participate in Lal Darwaza Bonalu
Harish rao Visit Participate in Lal Darwaza Bonalu

Harish rao Visit Renuka Ellamma Temple : సిద్దిపేట పట్టణంలోని ఐదో వార్డులో ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని మంత్రి హరీశ్​రావు దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బోనాల పండుగ ఘనంగా జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. పండుగను పురస్కరించుకుని సాంప్రదాయ పద్ధతిలో అక్కాచెల్లెలు బోనాలు సమర్పస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, దుష్టశక్తుల నుంచి రక్షణ కల్పించాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఎంతో సంతోషంగా ఈ బోనాల పండుగను చేసుకుంటున్నారని అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా బోనాలు జరుపుకోవడం సంతోషం..: మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. పంటలు బాగా పండాలని, ప్రజలంతా సంతోషంగా, సుభిక్షంగా ఉండేలా చేయాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, యూరోప్, సింగపూర్​ లాంటి వివిధ దేశాల్లో ఉండే తెలంగాణ ప్రాంత వాసులు ప్రపంచ వ్యాప్తంగా బోనాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. బోనాల పండుగ జరుపుతూ మన ప్రాంత, ప్రజల సంస్కృతి, సంప్రదాయం కాపాడే ప్రయత్నం జరుగుతున్నదని మంత్రి హరీశ్​రావు స్పష్టం చేశారు.

Lal Darwaza Bonalu 2023 : లాల్‌దర్వాజలో ఘనంగా బోనాల సంబురాలు

Bonalu Celebrations 2023 in Hyderabad : గత నెల రోజుల నుంచి హైదరాబాద్​ నగరంలో బోనాలు వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. మొదటిగా జూన్​ 22న గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి తొలి బోనాల జాతర జరిగింది. ఆ తరవాత జులై 9న సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండగ జరిగింది. 10న రంగం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఆనందంగా బోనాలు సమర్పించారు. ప్రతి ఒక్కరు వివిధ నృత్యాలతో ఆనందోత్సవంలో మునిగిపోయారు. ఉజ్జయిని అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బంగారు బోనం సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ దర్శించుకున్నారు.

Telangana political Leaders Participate in Bonalu : మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయకులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో అధికారులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తలకు ఎటువంటి ఆటంకం రాకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టారు. పండగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. నేడు లాల్​ దర్వాజలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి. అనంతరం సోమవారం రంగం నిర్వహించనున్నారు. దీంతో బోనాలు ముగింపు పలకనున్నారు. ఈ బోనాల జాతర ఘనంగా జరుగుతుంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు, భక్తులు అందరూ.. భక్తితో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.