హరీశ్‌రావుకు పార్టీలో సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు : ఈటల రాజేందర్

హరీశ్‌రావుకు పార్టీలో సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు : ఈటల రాజేందర్
హరీశ్‌రావుకు పార్టీలో స్వతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీ ఆర్ ఆజ్ఞా లేనిదే మంత్రులంతా ఏమీ చేయలేరని ఈటల ఆరోపించారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే ఎస్టీ, ఎస్సీ. బీసీ, లను ముఖ్యమంత్రి చేస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పింఛన్ తియ్యమని.. రెండు పింఛన్లు ఇస్తామన్నారు. రూపాయి ఖర్చు కాకుండా ఉచిత విద్య అందిస్తామన్నారు.
Etela Rajendar Election Campaign In Siddipet : హరీశ్‌రావుకు తనని విమర్శించే హక్కు లేదని ఈటల రాజేందర్ అన్నారు. హరీశ్‌రావుకు బీఆర్ఎస్(BRS)లో సొంతంగా పనిచేసే కెపాసిటీ ఉందా.. సొంతంగా మీరు నిర్ణయం తీసుకోగలరా.. ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు.. అలానే కేసీఆర్ చెప్పనిదే ఏమన్నా చేయగలవా.. అంటూ మంత్రి హరీష్‌రావును బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, గజ్వేల్ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. కుక్కునూరుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఈటల పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలను సీఎం చేస్తారా అని ఈటల రాజేందర్ కేసీఆర్‌కు సవాల్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే తర్వాత ఆయన కుంటుంబమే ముఖ్యమంత్రిలుగా వస్తారని ఈటల దుయ్యబట్టారు. ఇతరులెవరు సీఎం కాలేరని విమర్శించారు.
Etela Rajendar Fires On BRS : అణగారిన వర్గాల పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ ఏనాడైనా ఎస్టీ, ఎస్సీ, బీసీని ముఖ్యమంత్రి చేశారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ పేదరికాన్ని అనుభవించిన బిడ్డ కాబట్టి బీసీని సీఎం చేస్తా అని ప్రకటించారు. మన ఓట్లు మనమే వేసుకోవాలి. వాళ్లకి ఓట్లు వేసి పనులు చేయమంటే చెయ్యరు. శుక్రవారం సీఎం మాట్లాడుతూ.. గాడిదలకు గడ్డివేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా? అని అడుగుతున్నారు. తాను అదే అడుగుతున్న..కేసీఆర్‌కి ఓటు వేసి.. ఇల్లు, రేషన్ కార్డు ఇవ్వమంటే ఇస్తారా? ఫాం హౌస్ కట్టుకున్న సీఎం పేదలకు ఇళ్లు ఇవ్వడానికి మనసు రావడం లేదని ఆరోపించారు. పేదల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
Etela Rajendar Comments On KCR : మన బాధలు ఆయనకు ఏం తెలుస్తుందని ఈటల ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పింఛన్ తియ్యమని.. రెండు పింఛన్లు ఇస్తామన్నారు. రూపాయి ఖర్చు కాకుండా ఉచిత విద్య అందిస్తామన్నారు. దుఃఖం అనుభవించిన వాణ్ణి కాబట్టే ఆ బాధ నాకు తెలుసని. భర్త, కొడుకులను బ్రతికించుకోవడం కోసం పుస్తెల తాళ్లు.. అమ్ముకునే అవసరం లేకుండా ఉచిత వైద్యం అందిస్తామన్నారు. వడ్డీలేని రుణాలు అప్పుగా ఎందుకు ఇవ్వడం లేదని హరీశ్‌రావును ప్రశ్నించాలని ప్రజలను కోరారు. మేం అధికారంలోకి వస్తే.. అప్పులు వెంటనే విడుదల చేస్తామన్నారు. మహిళలకు మూడునెలలకొకసారి వారి ఖాతాలోనే వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తామన్నారు. మహిళలు కట్టే ఇన్సూరెన్స్ తామే కడతామన్నారు. ఒక్క కిలో అదనపు తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.
