ఆకలి తెలిసిన మేము అధికారంలోకి వస్తే బాధలన్నీ తీరుస్తాం : ఈటల రాజేందర్

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2023, 9:45 PM IST

thumbnail

Etela Rajendar Election Campaign in Shamirpet : అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ చెంప చెళ్లుమనిపించేలా తీర్పు ఇవ్వాలని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. ఆకలి తెలిసిన తాము అధికారంలోకి వస్తే బాధలు అన్నీ తీరుస్తామని హమీనిచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్​పేట్ మండల కేంద్రంలో మేడ్చల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్​రెడ్డికి మద్దతుగా ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబ్బులు ఖర్చుపెట్టి గెలుపు సాధించాలని అన్నట్లుగా రాజకీయాలు తయారయ్యాయని ఆరోపించారు. ప్రజల సమస్యలు తీర్చేవారిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎం ఈ రూట్లో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ఒక్కరోజైనా శామీర్​పేట్​లో ఆగాడా? మనల్ని కలిశాడా? సమస్యలు విన్నాడా..? అని ఈటల రాజేందర్ ప్రజలను ప్రశ్నించారు. ప్రజలను కలవని ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు.  

Etela Rajendar Comments on CM KCR : కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా సీఎం కలవరని ఆరోపించారు. కొత్త సచివాలయం కట్టుకున్నా ఒక్క రోజు రాలేదని ఎద్దేవా చేశారు. ప్రజల్ని కలవని, పట్టించుకోని కేసీఆర్​ను మళ్లీ గెలిపిద్దామా అని ప్రశ్నించారు. మల్లారెడ్డికి ఓటు వేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని విమర్శించారు. సుదర్శన్​రెడ్డికి ఓటు వేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారని సూచించారు. సుదర్శన్​రెడ్డికి ఓటు వేయడం అంటే.. ధర్మానికి ఓటు వేయడం, అహంకారాన్ని అణచివేయడమని స్పష్టం చేశారు. బొమ్మరాశిపేటలో భూములన్నీ గుంజుకొని పెద్దలకు కేసీఆర్ కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గజ్వేల్​కు వస్తున్నానని తెలవగానే కేసీఆర్ కామారెడ్డికి పారిపోయాడని ఎద్దేవా చేశారు. గజ్వేల్​లో గెలిచేది ధర్మమేనని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అండతో హామీ ఇస్తున్నా:

  • ప్రతి పేదవాడికి ఇంగ్లీష్​ ​మీడియం విద్య ఉచితంగా అందిస్తాం
  • ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తాం
  • నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాం
  • ఇద్దరు ముసలోళ్లకు పెన్షన్ అందిస్తాం
  • డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అర్హులందరికీ ఇస్తాం

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.