ETV Bharat / state

అన్నదాతలను ఎగవేతదారులుగా ముద్ర వేశారు: ఈటల రాజేందర్

author img

By

Published : Jan 12, 2023, 9:39 PM IST

ఈటల రాజేందర్
ఈటల రాజేందర్

Etela rajendar fires on KCR: రైతులకు రుణం పుట్టకుండా బ్యాంకుల్లో ఎగవేతదారులుగా ముద్ర వేయిస్తున్న సీఎం కేసీఆర్ తీరును అన్నదాతలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన యువజన దినోత్సవ వేడుకల్లో ఈటల ముఖ్యఅతిథిగా పాల్గొని సీఎం కేసీఆర్​పై ఈటల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Etela rajendar fires on KCR: బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో రైతు కుటుంబాలకు రుణం పుట్టక బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించలేకపోతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు.సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన యువజన దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని కేసీఆర్​పై, బీఆర్ఎస్ ప్రభుత్వతీరుపై తీవ్రంగా మండిపడ్డారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయకుండా అబద్దాలతో కేసీఆర్ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.

గొప్పగా చెప్పుకునే తెలంగాణ సంక్షేమ పథకాలపై ప్రభుత్వానికి విశ్వాసం ఉంటే కేసీఆర్ వెన్నులో ఎందుకు వణుకు పుడుతుందని ఈటల ప్రశ్నించారు. సీఎం, మంత్రుల పర్యటనల పేరుతో పోలీసులను అడ్డంపెట్టుకుని ప్రతిపక్షాలను అడ్డుకోవడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని అన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్​కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈటల జోస్యం చెప్పారు. అంతకుముందు పద్మశాలి భవన్ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఈటల సందర్శించారు. అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

" బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు బ్యాంకుల్లో అప్పు పుట్టకుండా చేసి ఎగవేతదారులుగా ముద్ర వేశారు. రైతు కుటుంబాలకు రుణం పుట్టక బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించలేకపోతున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయకుండా అబద్ధాలతో కేసీఆర్ కాలం గడుపుతున్నారు. గొప్పగా చెప్పుకునే తెలంగాణ సంక్షేమ పథకాలపై ప్రభుత్వానికి విశ్వాసం ఉంటే కేసీఆర్ వెన్నులో ఎందుకు వణుకు పుడుతుంది. రానున్న రోజుల్లో కేసీఆర్​కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి". - ఈటల రాజెేందర్, హుజూరాాబాద్ ఎమ్మెల్యే

అన్నదాతలను ఎగవేతదారులుగా ముద్ర వేశారని కేసీఆర్​పై మండిపడ్డ ఈటల

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.