ETV Bharat / state

Mahmood ali on Drugs: 'డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలిస్తాం... మూలాలు లేకుండా చేస్తాం'

author img

By

Published : Jan 30, 2022, 7:25 PM IST

Mahmood ali on Drugs: శంషాబాద్‌ రూరల్ పోలీస్ స్టేషన్‌ భవనాన్ని చినజీయర్ స్వామితో కలిసి హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. పోలీసుల సదుపాయాల కోసం రూ.700కోట్లు విడుదల చేసినట్లు హోంమంత్రి తెలిపారు.

Mahmood
Mahmood

Mahmood ali on Drugs: రాష్ట్రంలో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలిస్తామని హోంమంత్రి మహమూద్‌ అలీ స్పష్టం చేశారు. డ్రగ్స్‌ నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని... త్వరలోనే అందరిని పట్టుకుని మూలాలు తొలగిస్తామని హోంమంత్రి తెలిపారు. నూతనంగా రూ.4.5కోట్ల వ్యయంతో నిర్మించిన శంషాబాద్‌ రూరల్ పోలీస్ స్టేషన్‌ భవనాన్ని చినజీయర్ స్వామితో కలిసి హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.

రాష్ట్రంలోని పోలీసులకు అన్ని సదుపాయాల కోసం రూ.700 కోట్లు విడుదల చేసినట్లు హోంమంత్రి తెలిపారు. మహిళల భద్రతకు ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ దేశంలోనే ఎక్కడాలేని విధంగా షీ టీమ్స్‌ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు పూర్తిస్థాయిలో తగ్గాయని పేర్కొన్నారు. సైబర్ నేరాలు జరగకుండా అప్రమత్తంగా ఉంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పలువురు పోలీసులు పాల్గొన్నారు.

'డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలిస్తాం... మూలాలు లేకుండా చేస్తాం'

'తెలంగాణ వచ్చాకా... ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖను చాలా అభివృద్ధి చేశారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పోలీస్‌ శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దమొత్తంలో నిధులు విడుదల చేసి బలోపేతం చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సమర్థంగా పనిచేస్తోంది. రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నాయంటే అందుకు కారణం శాంతి భద్రతలు. వాటిని సక్రమంగా నిర్వహిస్తున్న పోలీసులకు ధన్యవాదాలు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం లేకుండా చేస్తాం. అందుకోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తాం.

-- మహమూద్ అలీ, హోంమంత్రి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

డ్రగ్స్ నిర్మూలనకు ద్విముఖ వ్యూహం అనుసరించాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.