ETV Bharat / state

మే నెలాఖరు వరకు బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనాలు

author img

By

Published : Mar 29, 2023, 9:25 AM IST

BRS spiritual meetings
BRS spiritual meetings

BRS Atmiya Sammelanam in Telangana : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనాలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ సమావేశాలను తొలుత పార్టీ ఆవిర్భావ దినోత్సవం(ఏప్రిల్ 27) నాటికి పూర్తి చేయాలని గతంలో నిర్ణయించారు. అయితే తాజాగా ఈ సమ్మేళనాలు మే నెలాఖరు వరకు కొనసాగుతాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు.

దేశంలో బీజేపీకు ప్రత్యామ్నాయం బీఆర్​ఎస్​ మాత్రమేనని స్పష్టం

BRS Atmiya Sammelanam in Telangana : బీఆర్​ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ సమావేశాలను మే నెలాఖరు వరకు కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అంటే ఏప్రిల్ 27 నాటికి పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు గతంలోనే నిర్ణయించారు. ఇది ఎన్నికల సంవత్సవం కాబట్టి ఆత్మీయ సమ్మేళనాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ ఆదేశించారని కేటీఆర్ వెల్లడించారు. అందుకే ఆత్మీయ సమ్మేళనాల గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకోవాలని జిల్లా ఇన్​ఛార్జీలను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

BRS Atmiya Sammela news : మరోవైపు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు కామారెడ్డి, జోగులాంబ గద్వాల,యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. నల్గొండ, మునుగోడులో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మంత్రి జగదీశ్​రెడ్డి హాజరయ్యారు. దేశంలో బీజేపీకు ప్రత్యామ్నాయం బీఆర్​ఎస్​ మాత్రమేనని మంత్రి అన్నారు విపక్షాల మాయలో పడి సంక్షేమ ప్రధాత కేసీఆర్​ను దూరం చేసుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని వివరించారు.

"నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్​లో కేవలం ఆరుగంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారు. ప్రతి మోటారుకు మీటరు ఉంది. ప్రతి నెల రైతులు రూ. 1000 నుంచి రూ.5000 బిల్లులు రైతులు కడుతున్నారు. గుజరాత్​లో రైతుబంధు లేదు. కాంగ్రెస్ పాలిస్తున్న రాజస్థాన్​లో ఇవన్నీ లేవు." - జగదీశ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమి కలాన్​లో బీఆర్​ఎస్​ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే జాజుల సురేందర్ హాజరయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడులో ఎమ్మెల్యే అబ్రహం అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంతో సీనియర్ నేత శంకర్​ రెడ్డి వ్యాఖ్యలతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. ఆయనకు జెడ్పీ ఛైర్​పర్సన్ సరిత సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్​నాలా జలాశయం వద్ద జరిగిన సమావేశం ఎమ్మెల్యే హన్మంత్ షిండే అధ్యక్షత నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా తేనెటీగలు ఉండే పట్టు చెదరడంతో.. కార్యకర్తలు అందరూ సభాస్థలి నుంచి పరిగెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో జరిగిన బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే గొంగిడి సునీత హాజరయ్యారు. అలా బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనాలు కార్యకర్తలు అందరినీ కలుపుకుంటూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ సాగుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.