ETV Bharat / state

కారుపై పడిన జేసీబీ.. ముగ్గురు దుర్మరణం

author img

By

Published : Mar 29, 2023, 7:36 AM IST

Road Accident In Nizamabad: కారుపై జేసీబీ పడి.. ముగ్గురు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఓ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. అసలేం జరిగిందంటే..?

road accident
road accident

Road Accident In Nizamabad today: ఆ తల్లి తన కుమారుడు, కుమార్తె కుటుంబాలతో కలిసి పిల్లల కుటుంబాలతో కలిసి దైవ దర్శనానికి వస్తానని మొక్కిన మొక్కు చెల్లించాలనుకుంది. తల్లి కోరిక మేరకు ఆ కుటుంబమంతా కలిసి ఎంతో సంతోషంగా దైవ దర్శనానికి వెళ్లారు. భక్తి శ్రద్ధలతో కలిసి కుటుంబమంతా దేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రశాంతంగా దైవ దర్శనం జరిగిందన్న ఆనందంలో.. ఎంతో ఉత్సాహంగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మరి కాసేపట్లో ఇళ్లు చేరతారనే తరుణంలో అనుకోని ప్రమాదం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఇద్దరు పిల్లలను అనాథలుగా మార్చింది. ఓ తల్లిని తన పిల్లలకు దూరం చేసింది. అసలేం జరిగిందంటే..?

JCB fell on to the car in Nizamabad: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దొన్కల్​కు చెందిన లక్ష్మి అనే మహిళ తన కుటుంబంతో కలిసి బడా భీమ్​గల్​ ఎల్లమ్మ ఆలయానికి మొక్కు చెల్లించడానికి వెళ్లారు. మొక్కు చెల్లించి కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. భీంగల్​లోని విద్యుత్ ఉపకేంద్రం వద్దకు వచ్చేసరికి ట్రాక్టర్ ట్రాలీపై తీసుకెళ్తున్న పొక్లెయిన్ ప్రమాదవశాత్తు లక్ష్మీ కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

Nizamabad Road Accident today : స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. కారులో నుంచి మృతదేహాలను, బయటకు తీయడానికి సిబ్బందికి సుమారు గంటకుపైగానే సమయం పట్టిందని స్థానికులు తెలిపారు. వేరే జేసీబీతో ఈ పొక్లెయిన్​ను పక్కకు తీశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీ, ఆమె అల్లుడు చుక్కారపు రాజేశ్వర్​లను పోలీసులు నిజామాబాద్ స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో లక్ష్మీ కుమారుడు ముప్పారపు రాజేశ్వర్, కోడలు జ్యోతి, కుమార్తె రమ మృతి చెందారని తెలిపారు. పొక్లెయిన్

ఈ ప్రమాదంలో రాజేశ్వర్, జ్యోతి మరణించడంతో వారి పిల్లలిద్దరు అనాథలయ్యారు. తల్లిదండ్రుల మరణం గురించి తెలిసి ఆ పిల్లలు గుండెలవిసేలా రోదించారు. వారి రోదనులు చూసి స్థానికులు కంటతడి పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ట్రాక్టర్ ట్రాలీపై నుంచి జేసీబీ.. ఎదురుగా వచ్చిన కారుపై ఎలా పడిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. కారు ట్రాక్టర్‌ ట్రాలీని ఢీకొట్టిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.