ETV Bharat / state

నాగర్​కర్నూల్​ జిల్లాలో భారమై దూరమైతున్న మల్బరీ సాగు

author img

By

Published : Jan 29, 2021, 12:45 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లాలో వెలవెలబోతున్న మల్బరీ సాగు
నాగర్​కర్నూల్​ జిల్లాలో వెలవెలబోతున్న మల్బరీ సాగు

ఒకప్పుడు ఎంతో ఆదరణ ఉన్న పట్టుపరిశ్రమ నేడు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మసకబారిపోయింది. రైతులు మల్బరీ చెట్ల పెంపకం వైపు మొగ్గు చూపకపోవడంతో ఆ పరిశ్రమ వెలవెలబోతోంది. నాగర్​ కర్నూల్​ జిల్లాలోని సెరీకల్చర్​పై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

నాగర్​కర్నూలు జిల్లాలో పట్టు పరిశ్రమ ఒకప్పుడు మూడు పువ్వులు ఆరుకాయలుగా విలసిల్లింది. జిల్లాలో నాగర్​కర్నూల్​, మన్ననూర్​, కొట్రపాలెం, వట్టెం గ్రామాల వద్ద సెరీకల్చర్​ ద్వారా మల్బరీ మొక్కలను సాగు చేస్తారు. ఈ మొక్కల వల్ల పట్టుపురుగులను పెంచి వాటి నుంచి పట్టుకాయలను తీసి అమ్ముతారు. దీని ద్వారా పట్టు ఉత్పత్తి అవుతుంది. ఇలా మల్బరీ మొక్కల నుంచి వచ్చే కాయల నుంచి పట్టును ఉత్పత్తి చేస్తారు. అయితే గతంలో రైతులు, వ్యాపారస్తులు పట్టుసాగుపై బాగా మొగ్గు చూపేవారు. లాభాలు కూడా బాగా ఉండటంతో రైతులు మల్బరీ మొక్కలను పెంచడానికి మొగ్గు చూపేవారు. ఒకప్పుడు జిల్లాలోని సుమారు 50 వేల మొక్కలు సాగు చేసే వారు. కానీ ఇప్పుడు ఆదరణ లేక జిల్లాలోని ఉన్న కొన్ని నర్సరీలు మూతపడ్డాయి.

కళ తప్పిన మల్బరీ

గతంలో ఒక్కొక్క మొక్క ధర రూపాయిన్నర వెచ్చించి తీసుకునేవారు. ఇప్పుడు ఒక్కో మొక్క సుమారు రెండు రూపాయలైంది. ఒక్కో రైతు తన తోటలో సుమారు 500 నుంచి 1000 మొక్కలు తీసుకొని పెంచి పట్టు కాయలను సాగు చేసేవారు. కానీ ఇప్పుడు మల్బరీ మొక్కల నిర్వహణ భారం అధికమైంది. రైతులు మల్బరీ పరిశ్రమ మొక్కలు పెంచడం కోసం 20ఫీట్ల పొడవు, 50ఫీట్ల వెడల్పు ఉన్న షెడ్లను ఏర్పాటు చేసుకోవాలి. సుమారు దీనికి నాలుగు నుంచి ఐదు లక్షలు రూపాయల ఖర్చవుతుంది. ఇంత వెచ్చించి ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పుడు పట్టు కాయల రేటు తగ్గింది.

ఆసక్తి చూపని ప్రభుత్వం

గతంలో పట్టు కాయల ధరలు అధికంగా ఉండేవి. ఇప్పుడు రేట్లు చాలా తగ్గాయి. దీంతో రైతులు సరైన లాభాలు లేక పోవడంతో సాగు చేయడం లేదు. పట్టు సాగుకు అధిక వ్యయం కావడంతో బీద రైతులు ఇంత మొత్తం వెచ్చించి నిర్వహించడం వారికి కష్ట సాధ్యమవుతుంది. ప్రభుత్వం కూడా పట్టు పరిశ్రమ సాగు వైపు పెద్ద ఆసక్తి చూపడం లేదు. ఒకప్పుడు ఒక్కో నర్సరీలో సుమారు ఏడు మంది ఉద్యోగులు మొక్కలు నాటడానికి, చూసుకోవడానికి, కలుపు తీయడానికి, పర్యవేక్షణ కోసం, నీరు పోయడం కోసం.. ఇలా ఒక్కో నర్సరీలో మొత్తం ఏడు మంది ఉండేవారు. ఇప్పుడు జిల్లాలోని నాలుగు నర్సరీలకు కలిపి ఒకే ఒక టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నారు. జిల్లా మొత్తంలో సెరీకల్చర్​కు ఏడు మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. పట్టు పరిశ్రమ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లాలోని మన్ననూరు, వట్టెం వద్ద ఎలాంటి మొక్కలు నాటడం లేదు. ప్రస్తుతం నాగర్​కర్నూల్​లో పాలెం వద్ద 14 వేల మొక్కలు సాగు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎప్పటి నుంచో చాలీచాలని జీతాలతో తాత్కాలికంగా పని చేస్తున్నారు. కొత్త వారి నియామకం ఇంతవరకు లేదు. ఉన్న వారితోనే సరిపెట్టారు. 30 ఏళ్ల నుంచి ఇలాగే ఇక్కడే నర్సరీలో పనిచేస్తున్నారు. వారికి జీతభత్యాలు పెంచాలని వారి ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: ఆకతాయిల చిట్టా సిద్ధం.. రెండోసారి చిక్కితే అంతే ఇక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.