ETV Bharat / state

ములుగు యువకుడి వివాహం.. పర్యావరణ హితం

author img

By

Published : Nov 12, 2019, 9:30 PM IST

ఓ విద్యావంతుని నినాదం ములుగు జిల్లా వ్యాప్తంగా మార్మోగుతోంది. ఒక్క ప్లాస్టిక్​ వస్తువు వినియోగించకుండా ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఈ పర్యావరణహిత పెళ్లికి ప్రశంసలు వస్తున్నాయి.

ములుగు యువకుడి వివాహం.. పర్యావరణ హితం

ములుగు యువకుడి వివాహం.. పర్యావరణ హితం

అమెరికాలో ఉన్నతమైన ఉద్యోగం.. ఐదంకెల వేతనం.. అతని వివాహం అంటే పాశ్చత్యా సంస్కృతికి పట్టం కట్టినట్లు ఉంటుందని అనుకుంటాం. కానీ.. వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టి పర్యావరణ ప్రేమికుడు అనిపించుకున్నాడు.. ములుగు జిల్లా భూపాల్​నగర్​కు చెందిన ముక్క నాగరాజు.

ఒక్కటంటే ఒక్క ప్లాస్టిక్​ వస్తువు వినియోగించకుండా ఘనంగా వివాహం చేసుకున్నాడు. పెళ్లి కార్డు నుంచి తలంబ్రాల వరకు పూర్తిగా పర్యావరణహితమైన వస్తువులనే వినియోగించాడు. వరుడు వదువు పేర్లతో ప్రత్యేక సంచులను తయారుచేయించి పెళ్లి కార్డుతో సహా పంచిపెట్టాడు. సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ గ్లాసులకు బదులుగా 200 స్టీలు గ్లాసులను తీసుకొచ్చి వినియోగించాడు. తమ ప్రయత్నం వేల మందిలో మార్పువస్తుందనే ఆశ లేదని ఒక్కరు ఇద్దరు మారినా తాము సఫలీకృతం అయినట్లేనని తెలిపాడు వరుడు నాగరాజు.

ములుగు జిల్లాలో ఎక్కడ చూసిన ప్లాస్టిక్​ నివారణ కోసం తాము సైతం అనే వాళ్లే ఎక్కువ శాతం ఉన్నారు. భావితరాలకు మంచి చేయకపోయినా పరవాలేదు కానీ చెడు చేయవద్దనే సంకల్ప బీజం వీరిలో బలంగా నాటుకుంది. ప్రతిజిల్లా.. ప్రతి వ్యక్తి ఇలానే ఉంటే ఒకప్పుడు ప్లాస్టిక్​ వాడేవాళ్లాం అనే రోజులు ఇంకెంతో దూరంలో లేవు మరి..

ఇవీచూడండి:''నేను చేసుకున్న పెళ్లిళ్లతోనే జగన్ రెండేళ్లు జైలుకెళ్లారా..?''

Intro:tg_wgl_51_10_pellio_plastic_nishadam_pkg_ts10072_HD
G Raju mulugu contributor

యాంకర్ : జిల్లా కలెక్టర్ ములుగు జిల్లా లోని ప్లాస్టిక్ నివారణ చేయాలంటూ పర్యావరణ పరిరక్షణ ప్రణాళికలో భాగంగా ప్రజలు వ్యాపారవేత్తలు మద్దతిస్తున్నారు. ఇందులో భాగంగానే కొత్తగా పెళ్లి చేసుకునే వారు కూడా ప్లాస్టిక్ నిషేధం తో పెళ్లి చేసుకోవడం విశేషం గా మారింది.


Body:వాయిస్ ఓవర్ : ప్లాస్టిక్ నివారణ నిర్మూలించాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని దేశంలోనే ములుగు జిల్లా ప్లాస్టిక్ రహిత జిల్లాగా పేరు తెచ్చుకోవాలని , కలెక్టర్ సి నారాయణ రెడ్డి చేపట్టిన ఈ సంకల్పానికి ములుగు జిల్లా భూపాల్ నగర్ గ్రామానికి చెందిన ముక్క రమేష్ సుజాత కుమారుడు నాగరాజు యూఎస్ లో ఉద్యోగం చేస్తుంటాడు. అతనికి అమెరికాలో ఉంటున్న శృతి అనే అమ్మాయిని ఈరోజు ఆదివారం వివాహం చేసుకుంటున్నాడు. ఈ వివాహానికి ప్లాస్టిక్ సంబంధించిన ఏ వస్తువైనా వినియోగించకుండా వివాహం చేసుకుంటున్నాడు. పెళ్లి కార్డు కూడా అ భూమి లో కలిసే విధంగా ముద్రించారు.కుట్టించిన పేపర్ సంచుల పై చెట్లు ప్రగతికి మెట్లు, ప్లాస్టిక్ నిషేధం పర్యావరణాన్ని కాపాడుదాం ముద్ర తో మరోపక్క అబ్బాయి అమ్మాయి పేరు తో పేపర్ సంచులు కుట్టించి బ్యాగు తో పాటు పెళ్లి కార్డు జిల్లా కలెక్టర్ కు, బంధువులకు, మిత్రులకు అందించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని సంకల్పంతో మేము కూడా పెళ్లిలో ప్లాస్టిక్ గ్లాస్ గాని ప్లేట్స్ కానీ వాడవద్దని 200 స్టీలు గ్లాసులు తీసుకొచ్చామని అన్నారు. మా ఇంటి డెకరేషన్ కు ప్లాస్టిక్ వస్తువులను వాడకుండా పూర్వంలో అరిటాకులు, పాల చెట్టు కోమ్మలు, మామిడి ఆకులు, కొబ్బరి మట్టలు ప్రకృతిలో సహజంగా దొరికే వాటిని తీసుకొచ్చి ఇంటిని అలంకరించాలని అన్నారు. పెళ్లి లో ఎలాంటి ప్లాస్టిక్ వాడకుండా వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నానని వరుడు నాగరాజు అన్నాడు. ఇప్పుడు జరిగే ఈ వివాహానికి తెచ్చిన స్టీలు గ్లాసులు నా పెళ్లికే కాకుండా మరెన్నో శుభకార్యాలకు ఉపయోగపడతాయని అన్నారు. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్స్ వాడి పడేస్తే భూమిలో వందల ఏళ్ల దాకా ప్లాస్టిక్ భూమిలో కలిసిపోకుండా పర్యావరణాన్ని దెబ్బ తీస్తుందని అన్నారు. అందుకే పెళ్లికి వచ్చిన వారు ప్లాస్టిక్ వస్తువులు వాడటం లేదని గమనిస్తారని వచ్చిన బంధువులు వారి ఇళ్ళల్లో శుభ కార్యాలు జరిగినప్పుడు ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా శుభకార్యాలు చేసుకుంటారనే ఉద్దేశంతో మా పెళ్లి లోనే ప్లాస్టిక్ పువ్వులు, గ్లాసులు, ప్లేట్స్, కవర్స్ పూర్తిస్థాయిలో వాడకుండా వివాహం జరుగుతుందని అన్నారు. ప్లాస్టిక్ నిషేధిత వివాహం ద్వారా ప్రజలలో కొంత అవగాహన కలిగి సమాజంలో మార్పు వస్తుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అని అన్నారు.


Conclusion:బైట్స్: 1, నాగరాజు పెళ్లి కొడుకు భూపాల్ నగర్ యూఎస్ఎ
2, వాసు గుప్తా యూఎస్ఏ
3, కృష్ణవేణి యూఎస్ఏ
4, ప్రసాద్ బంధువు మణుగూరు
5, సుజాత బంధువు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.