ETV Bharat / state

Forest Officers: మాజీ ఎమ్మెల్యే సోదరుడి నిర్వాకం.. అటవీ అధికారుల నిర్భంధం

author img

By

Published : Jun 9, 2021, 7:57 PM IST

Updated : Jun 9, 2021, 8:08 PM IST

అటవీభూమిని చదును చేసినందుకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ సోదరుడు జై కుమార్ గౌడ్​ నిర్భందించారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా షాపూర్​నగర్​లో జరిగింది. నిన్న గాజులరామారంలోని అటవీ భూములు చదును చేస్తుండగా అధికారులు అడ్డుకోవడంతో వివాదం తలెత్తంది.

forest officers are Detention by ex mla brother
అటవీశాఖ సిబ్బందితో మాజీ ఎమ్మెల్యే సోదరుడు వాగ్వాదం

అటవీ భూములు చదును చేస్తుండగా అడ్డుకుని... నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన సిబ్బందిని నిర్భందించిన ఘటన మేడ్చల్‌ జిల్లా షాపూర్‌నగర్‌లో జరిగింది. గాజులరామారంలోని అటవీ భూమి పక్కనే మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం సోదరుడు... జై కుమార్‌ గౌడ్​కు భూమి ఉంది. ఆయన మంగళవారం ప్రొక్లెయినర్‌తో అటవీ భూములు చదును చేస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.

అటవీ అధికారుల నిర్భంధం

దీంతో ఒకరిపై ఒకరు దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటనపై నోటీసులు ఇవ్వడానికి షాపూర్‌నగర్‌లోని జై కుమార్ గౌడ్​ ఇంటికి అటవీశాఖ అధికారులు వెళ్లగా... ఆయన భద్రతా సిబ్బంది వారిని కొద్దిసేపు నిర్బంధించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడి వారిని పంపినట్లు దూలపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీదేవి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Highcourt: ప్రజల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదు: హైకోర్టు

Last Updated : Jun 9, 2021, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.