ETV Bharat / state

పాతపద్ధతినే కొనసాగించాలంటూ దస్తావేజు లేఖరుల ధర్నా

author img

By

Published : Dec 15, 2020, 3:11 PM IST

వ్యవసాయేతర ఆస్తుల నమోదు పాత పద్ధతిలోనే కొనసాగించాలంటూ దస్తావేజు లేఖరులు ఆందోళన బాటపట్టారు. కొత్త విధానం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని మేడ్చల్ జిల్లా ఉప్పల్​ సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.

Document writers' dharna that registrations should be done in the old format in medchal dist uppal
పాతపద్ధతినే కొనసాగించాలంటూ దస్తావేజు లేఖరుల ధర్నా

రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా మొదటిరోజు సర్వర్​లు మొరాయించడంతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని మేడ్చల్​ జిల్లా ఉప్పల్​ సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయం ముందు దస్తావేజు లేఖరులు ఆందోళనకు దిగారు.

ధరణి పోర్టల్​లో సాంకేతిక సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. కార్యాలయంలోకి వెళ్లి పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో స్థిరాస్తి వ్యాపారులు, దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'ఉద్యోగాల భర్తీ విషయంలో సర్కార్​కు చిత్తశుద్ధి లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.