ETV Bharat / state

ఎన్ని పరిశ్రమలొచ్చినా వ్యవసాయమే ఆధారం: కిషన్​ రెడ్డి

author img

By

Published : Jan 23, 2021, 2:07 PM IST

Assistant Minister of State for Home Affairs kishan reddy inaugurated krushi bhavan in medak district
ఎన్ని పరిశ్రమలొచ్చినా వ్యవసాయమే ఆధారం: కిషన్​ రెడ్డి

ఎన్ని పరిశ్రమలు వచ్చినా.. వ్యవసాయమే ప్రధాన ఆధారమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. మెదక్​ జిల్లా తునికిలో డాక్టర్ రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రంలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. వచ్చే నెలలో రామగుండం ఎరువుల పరిశ్రమను ప్రధాని ప్రారంభిస్తారని ప్రకటించారు.

మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలో డాక్టర్ రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రంలో నూతనంగా నిర్మించిన భవనాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి ప్రారంభించారు. ఎన్ని పరిశ్రమలు వచ్చినా.. వ్యవసాయమే ప్రధాన ఆధారమన్నారు. గతంలో వ్యవసాయం, పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఉండేవని... మోదీ ప్రధాని అయ్యాక విద్యుత్ రంగంలో విశేషమైన మార్పు వచ్చిందన్నారు.

వన్ నేషన్-వన్ గ్రిడ్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. రైతులు పంటలను ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పంచామని పేర్కొన్నారు. రూ.6 వేల కోట్లతో రామగుండం ఎరువుల పరిశ్రమ పునరుద్ధరణ చేస్తున్నట్లు చెప్పారు. కిసాన్ బ్రాండ్‌తో యూరియాను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. వచ్చే నెలలో ఎరువుల పరిశ్రమను ప్రధాని ప్రారంభిస్తారని ప్రకటించారు.

భవనాలను ప్రారంభించిన కిషన్​ రెడ్డి
భవనాలను ప్రారంభించిన కిషన్​ రెడ్డి

అంతకుముందు ఇక్కడ సాగు చేసిన పలు రకాల పంటలను తిరిగి పరిశీలించారు. గిరి ఆవులను చూసి ముగ్దులు అయ్యారు. కిషన్ రెడ్డి వాటితో ముచ్చటగా గడిపారు. పంటల సాగు విధానాన్ని శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్​ఎస్ఎస్ కార్యనిర్వాహక కార్యదర్శి భయ్యాజి జోషి, ఏకలవ్య ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు.

కృషి విజ్ఞాన కేంద్రం
కృషి విజ్ఞాన కేంద్రం

ఇదీ చదవండి: 'ది కమర్షియల్‌ సినిమా'కు అక్షర రూపమిచ్చాడీ కుర్రాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.