ETV Bharat / state

బెల్లంపల్లిలో కొవిడ్​ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

author img

By

Published : May 15, 2021, 3:42 PM IST

బెల్లంపల్లిలోని కొవిడ్​ ఆస్పత్రిని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరిశీలించారు. కరోనా బాధితులను పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపారు.

mla durgam chinnaiah visited bellampally covid hospital
బెల్లంపల్లి కొవిడ్​ ఆస్పత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే

కరోనా బాధితులకు ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పిస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి కొవిడ్ ఆస్పత్రిని ఎమ్మెల్యే పరిశీలించారు. పీపీఈ కిట్లు ధరించి వైద్య సిబ్బందితో కలిసి కొవిడ్ వార్డులను తనిఖీ చేశారు.

కరోనా రోగులకు ధైర్యం చెప్పిన ఆయన.. ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని వారికి సూచించారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: ప్రభుత్వాసుపత్రికి ఆక్సిజనేటర్‌ యంత్రం అందజేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.