ETV Bharat / state

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి : సీఎస్​

author img

By

Published : Feb 24, 2021, 9:11 PM IST

కలెక్టరేట్​ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి​ సోమేశ్​ కుమార్​ అధికారులను ఆదేశించారు. మహబూబ్​నగర్ జిల్లాకేంద్రంలోని పాలకొండ సమీపంలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులను ఆయన తనిఖీ చేశారు. అంతకుముందు భూత్పూర్​ మండలం పోతులమడుగు గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు.

cs somesh kumar inspection on collector building works in mahaboobnagar district
కలెక్టర్ భవన నిర్మాణ పనులు తనిఖీ చేస్తున్న సీఎస్​ సోమేశ్ కుమార్​

మహబూబ్​నగర్ జిల్లాకేంద్రంలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను సీఎస్​ సోమేశ్​ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారును, సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంకటరావు, అబ్కారీశాఖ డైరెక్టర్​ సర్ఫరాజ్​ అహ్మద్​ ఆయన వెంట ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్, సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్ హాల్​, మొదటి, రెండో అంతస్తులో నిర్మిస్తున్న జిల్లా అధికారుల గదులను ఆయన పరిశీలించారు.

జిల్లాలోని భూత్పూర్ మండలం పోతులమడుగు గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని సీఎస్​ తనిఖీ చేశారు. పల్లె ప్రకృతి వనంలో ఆయన మొక్కలు నాటారు. ఆర ఎకరం స్థలంలో సుమారు 2 వేల పండ్ల, పూల మొక్కలను నాటడం జరిగిందని అధికారులు వివరించారు. పల్లె ప్రకృతి వనంలో పనులు బాగున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ కొనియాడారు.

cs somesh kumar inspection on collector building works in mahaboobnagar district
పల్లె ప్రకృతివనంలో మొక్కలు నాటిన సీఎస్​ సోమేశ్​కుమార్​

ఇదీ చూడండి : 'విజయం కోసం భాజపా వ్యూహం.. పార్టీనేతలకు బండి మార్గనిర్దేశం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.